close
Choose your channels

ఫార్ములా సినిమానే కావాలి...

Friday, January 11, 2019 • తెలుగు Comments

ఫార్ములా సినిమానే కావాలి...

గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో 'గౌతమ్‌నంద' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే కూడా గోపీచంద్ మరోసారి సంపత్ నందితోనే సినిమా చేయుబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అయితే ఎక్స్‌పెరిమెంటల్ మూవీ కాకుండా ఫార్ములా మూవీ చేద్దామని గోపీచంద్.. సంపత్‌నందితో అన్నాట్ట. నిర్మాత కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట.

ప్రస్తుతం గోపీచంద్ తిరు దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే సంపత్ నంది దర్శకత్వంలో సినిమా చేస్తారని సమాచారం. ఈలోపు సంపత్ నంది స్క్రిప్ట్ వర్క్ సహా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటారట.