నీరాజనం ఆడియో విడుదల

  • IndiaGlitz, [Thursday,September 01 2016]

మగేష్, సభ్యసాచి, కారుణ్య, సన షాలిని నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం నీరాజనం. అవన్ ఆళ్ల దర్శకుడు. మహాలక్ష్మీ మూవీస్ పతాకంపై తెలుగు, తమిళ, ఒరియా భాషల్లో ఈ చిత్రాన్ని దాడి అప్పలనాయుడు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర గీతాలు బుధవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు వి.సాగర్ విడుదల చేయగా రవిశంకర్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో బిగ్ సీడీని నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.ఆడియో సీడీని మల్కాపురం శివకుమార్ ఆవిష్కరించించారు.

ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ నీరాజనం మంచి టైటిల్. మంచి ప్లానింగ్‌తో మూడు భాషల్లో నిర్మించిన ఈ సినిమా నిర్మాత పెట్టిన ప్రతి పైసా తిరిగిరావాలి. రవిశంకర్ అందించిన పాటలు అద్భుతంగా వున్నాయి. సభ్యసాచి ఓరియాలో స్టార్ హీరో, షాపింగ్‌మాల్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మగేష్..ఈ ఇద్దరూ కలిసి నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలి అన్నారు. దర్శకుడు అవన్ ఆళ్ల మాట్లాడుతూ ఓ మ్యూజికల్ రియాలిటీ షో నేపథ్యంలో సాగే ముక్కోణ ప్రేమకథా చిత్రమిది. మూడేళ్ల క్రితం చేసుకున్న కథ ఇది. ఏడాది క్రితం నిర్మాతకు చెప్పాను. నాపై నమ్మకంతో కథ వినకుండానే ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారు.

నేటి ట్రెండ్‌కు అనుగుణంగా సాగుతుంది అన్నారు. నిర్మాత దాడి అప్పలనాయుడు మాట్లాడుతూ దర్శకుడిపై వున్న నమ్మకంతో తెలుగు, తమిళ, ఒరియా భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. నిర్మాతగా ఇది నా తొలి సినిమా. చాలా కథలు విన్నాను. అయితే అనుకున్న కథను సమర్థవంతంగా తెరకెక్కించగలిగే దర్శకుడైతే బాగుంటుందని అవన్ ఆళ్లను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు రవిశంకర్, మగేష్, సభ్యసాచి, కారుణ్య, సన షాలిని, బన్నీ ప్రకాష్, కెమెరామెన్ మహీశేర్ల, పి.తిలక్ తదితరులు పాల్గొన్నారు.

More News

రవితేజ మూవీ టైటిల్ ఇదే..!

మాస్ మహరాజా రవితేజ... సర్ధార్ డైరెక్టర్ బాబీకి గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా బాబీ స్ర్కిప్ట్ వర్క్ చేస్తున్నారు. రవితేజ, బాబీ కాంబినేషన్లో రూపొందే చిత్రాన్ని చుట్టాలబ్బాయి చిత్ర నిర్మాతలు నిర్మించనున్నారు.

పవర్ స్టార్ మూవీ టైటిల్ ఎనౌన్స్ చేసిన శరత్ మరార్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ నిరాశ పరచడంతో ఈసారి అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా సక్సెస్ ఫుల్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు.

జనతా గ్యారేజ్ రిజల్ట్ పై ఎన్టీఆర్ రియాక్షన్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్-మోహన్ లాల్ కాంబినేషన్లో కొరటాల శివ తెరకెక్కించిన జనతా గ్యారేజ్ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది.

హ్యాట్సాఫ్ రామ్ చరణ్..!

చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ సిటీ ప్రెసిడెంట్ నూర్ మహమ్మద్ గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాల వలన సికింద్రాబాద్ లోని

సెప్టెంబర్ 3న వస్తున్న 'నారదుడు'

సూరజ్ ప్రొడక్షన్స్-టు అవర్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఉమ-వై.వి.సత్యనారాయణ సంయుక్త్రంగా నిర్మిస్తున్న చిత్రం "నారదుడు".ధనుష్-జెనీలియా-శ్రియ జంటగా..