పాటల చిత్రీకరణలో 'నేల టిక్కెట్టు'

  • IndiaGlitz, [Friday,April 06 2018]

ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో, మాస్ మహారాజా 'రవితేజ' హీరోగా క్లాస్ మాస్ అంశాల మేళవింపుతో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న“నేల టిక్కెట్టు” సినిమాకి సంబంధించిన పాటల చిత్రీకరణ నృత్య దర్శకుడు రాజ సుందరం నేతృత్వంలో గండిపేటలోని భారతదేశ మొట్టమొదటి స్కైజోన్ ట్రాంపోలిన్ పార్కులో మూడు రోజులుగా జరుగుతుంది. షూటింగ్ వేగంగా పూర్తి చేసి మే 24న విడుదలకు సిద్ధం చేస్తున్నారు నిర్మాతలు.

రవితేజ సరసన మాళ్వికా శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఫిదా ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం, ఛోటా కే ప్రసాద్ కూర్పు, బ్రహ్మ కడలి కళ, ముఖేష్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.

More News

డబ్బింగ్ ప్రారంభించిన కీర్తి సురేష్

న‌టీమ‌ణి సావిత్రి బ‌యోపిక్‌గా ‘మహానటి’ సినిమా తెరకెక్కుతున్న‌ విషయం తెలిసిందే.

వెంకటేష్‌కే.. ఎందుకిలా?

విజయాన్నే తన ఇంటిపేరుగా మార్చుకున్న సీనియ‌ర్‌ హీరో విక్ట‌రీ వెంకటేష్.

'2.O' లో ఐశ్వర్యా రాయ్!?

సూపర్ స్టార్ రజనీకాంత్, అందాల తార ఐశ్వర్యా రాయ్ జంటగా నటించిన చిత్రం ‘రోబో’.

వచ్చాడయ్యో సామి.. 'భరత్‌ అనే నేను' మూడో పాట విడుదల

మహేష్‌, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్‌ అనే నేను'.

తొలి తెలుగు - ఇంగ్లీష్ క్రాస్ ఓవర్ చిత్రంగా 'ఫ్రెండ్స్ ఇన్ లా'

ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అమిత్ ఖన్నా దర్శకత్వం వహించిన 'ఫ్రెండ్స్ ఇన్ లా' తొలి తెలుగు - ఇంగ్లీష్ క్రాస్ ఓవర్ చిత్రంగా మన ముందుకు రాబోతుంది.