నేను కిడ్నాప్ అయ్యాను అక్టోబర్ 6 విడుదల

  • IndiaGlitz, [Thursday,September 28 2017]

మధురం మూవీ క్రియేషన్స్ పతాకంపై, కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో దగ్గుబాటి వరుణ్ సమర్పణలో మాధవి అద్దంకి నిర్మిస్తున్న చిత్రం 'నేను కిడ్నాప్ అయ్యాను'. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని క్లీన్ 'యూ' సర్టిఫికెట్ సంపాదించుకుంది . ఈ చిత్ర నిర్మాతలు అక్టోబర్ 6 న విడుదల చేస్తున్నారు. భ్రహ్మనందం, పోసాని కృష్ణ మురళి, తాగుబోతు రమేష్, రఘు బాబు , కృష్ణ భగవాన్ మరియు పృథ్వి లా హాస్యం మేజర్ హైలైట్ గా ఉండే ఈ చిత్రం ప్రేక్షకులకు పూర్తి వినోదం అందిస్తుంది. దర్శకుడు శ్రీకరా బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు

ఈ సందర్భంగా నిర్మాత మాధవి అద్దంకి గారు మాట్లాడుతూ "మా చిత్రం ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. సెన్సార్ బోర్డు మెంబర్స్ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేసారు. మా టీం అందరిని బాగా మెచ్చుకున్నారు. క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు. డైరెక్టర్ శ్రీకరా బాబు సినిమాని చాల బాగా చిత్రీకరించారు. బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, తాగుబోతు రమేష్ లా కామెడీ తోపాటు రఘు బాబు , కృష్ణ భగవాన్ మరియు పృథ్వి లా హాస్యం చాల బాగుంది నటించిన స్కీన్లు చాల బాగా వచ్చాయి. అక్టోబర్ 6 న విడుదల చేస్తున్నాము ".

దర్శకుడు శ్రీకరా బాబు మాట్లాడుతూ " అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. క్లీన్ యూ సర్టిఫికెట్ రావటం చాల సంతోషం గాఉంది. నిర్మాత కంప్రమైస్ కాకుండా సినిమా కి ఎంత కావాలో ఎంత ఖర్చుపెట్టారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ మమ్మల్ని సంప్రదిస్తున్నారు. చిత్రానికి పని చేసిన యూనిట్ సభ్యులందరు చాల బాగా సపోర్ట్ చేశారు. బ్రహ్మానందం పోసాని కృష్ణ మురళి, తాగుబోతు రమేష్ రఘు బాబు , కృష్ణ భగవాన్ మరియు పృథ్వి లా హాస్యం మేజర్ హైలైట్ గా ఉంటుంది. అక్టోబర్ 6 న సినిమా ని విడుదల చేస్తాము." అన్నారు.

More News

సూపర్ స్టార్ మహేష్ 'స్పైడర్'కి సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసలు

సూపర్ స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో ఠాగూర్మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ ఎల్ పి, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకాలపై ఎన్.ప్రసాద్ నిర్మించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'స్పైడర్'.

రెగ్యులర్ షూటింగ్ లో సాయిధరమ్ తేజ్- వి.వి.వినాయక్ చిత్రం

సుప్రీమ్ హీరో సాయిధరమ్తేజ్ కథానాయకుడిగా సి.కె.ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం రెగ్యులర్ సెప్టెంబర్ 22న హైదరాబాద్లో ప్రారంభమైంది.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కి బ్రేక్ నిచ్చిన 'ఆనందం'కి 16 ఏళ్లు

ప్రస్తుతం తెలుగులో నెం.1 మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్. 1999లో విడుదలైన దేవి చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమైన దేవిశ్రీకి ...

రామ్ చరణ్ నటనకి పదేళ్లు

మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా తెరంగేట్రం చేసినప్పటికీ.. తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకున్నాడు మెగాపవర్స్టార్ రామ్ చరణ్. చిరు తనయుడుగా 'చిరుత' పేరుతో సినిమా చేసి.. తెలుగు తెర పై తొలి అడుగులు వేసిన చరణ్..

పూరి 'మెహబూబా'

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి 'మెహబూబా' అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. పూరి తనయుడు ఆకాష్ పూరి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.