'నేను...శైలజ' పాటలు...జనవరి 1న సినిమా విడుదల

  • IndiaGlitz, [Wednesday,December 16 2015]

ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేసే డ్యాన్సులు బాగుంటాయి. మొత్తం క్యారెక్టర్ డ్యాన్స్ బేస్డ్ అయితే రామ్ రెచ్చిపోతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజా చిత్రం 'నేను... శైలజ'లో రామ్ అలాంటి పాత్రే చేశారు. డీజే (డిస్కో జాకీ)గా నటించారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో 'స్రవంతి' రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రామ్, సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటించింది. ఇటీవలే షూటింగ్ పూర్తయ్యింది. ఈ 21 పాటలను, జనవరి 1న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

ఈ సందర్భంగా స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ - '' ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య జరిగే ప్రేమ కథ ఇది. ముందు ఈ చిత్రానికి 'హరికథ' అనుకున్నప్పటికీ, ఆ తర్వాత 'నేను... శైలజ' బాగుంటుందని అదే ఫైనలైజ్ చేశాం. హీరో పాత్ర సాఫ్ట్ గా ఉంటూనే మాస్ కి కనెక్ట్ అవుతుంది. కిశోర్ తిరుమల ఈ పాత్రను అద్భతుంగా మలిచారు. సన్నివేశాలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన పాటలు అద్భుతంగా ఉంటాయి. చిత్రీకరణ కూడా కనువిందుగా ఉంటుంది. అనుకున్న విధంగా చిత్రాన్ని 55 రోజుల్లో పూర్తి చేయగలిగాం'' అని చెప్పారు.

రామ్ మాట్లాడుతూ - "ఇప్పటివరకూ ఈ తరహా పాత్రను నేను చేయలేదు. చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. లవ్లీగా కూడా ఉంటుంది. అన్ని వర్గాలవారు చూడదగ్గ చిత్రం ఇది'' అన్నారు.

సత్యరాజ్, నరేశ్, ప్రిన్స్, విజయ్ కుమార్, రోహిణి, ప్రగతి, కష్ణచైతన్య, ప్రదీప్ రావత్, ధన్యా బాలకష్ణ, శ్రీముఖి, హిమజ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: సమీర్ రెడ్డి, పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్ర్తి, రామజోగయ్య శాస్ర్తి, భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, డ్యాన్స్: శంకర్, ప్రేమ్ రక్షిత్, దినేష్, రఘు, ఫైట్స్: పీటర్ హెయిన్స్, హరి దినేష్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్: ఎ. శ్రీకర్ ప్రసాద్, సమర్పణ: కష్ణ చైతన్య, నిర్మాత: స్రవంతి రవికిశోర్, రచన-దర్శకత్వం: కిశోర్ తిరుమల.

More News

రేష్మి హీరోయిన్‌గా వి. సినీ స్టూడియో నూతన చిత్రం ప్రారంభం

వి. సినీ స్టూడియో పతాకంపై బాలాజీ నాగలింగం సమర్పణలో డి. దివాకర్‌ దర్శకత్వంలో 'జబర్ధస్త్‌ రేష్మి' ప్రధాన పాత్రలో 'వి. సినీ స్టూడియో' ప్రొడక్షన్‌ నెంబర్‌ 1 చిత్రం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది.

హీరోయిన్ కాకుంటే ఫైలట్ అయ్యేదాన్ని - దిశా పటాని

ముకుంద', 'కంచె' వంటి విభిన్న కథా చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని ఏర్పరుచుకున్న మెగాబ్రదర్‌ నాగబాబు తనయుడు సుప్రీమ్‌ హీరో వరుణ్‌ తేజ్‌ హీరోగా

సునీల్ హీరోగా 'ఈడు గోల్డ్ ఎహే'

పూలరంగడు, మర్యాద రామన్న, భీమవరం బుల్లోడు, మిస్టర్ పెళ్ళికొడుకు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన హీరో సునీల్ హీరోగా

రోబో 2 టైటిల్ మారింది

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈరోజు ప్రారంభ‌మైంది.

ప్లాప్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వరుణ్...

వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం లోఫర్.పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లోఫర్ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మించారు.ఈ చిత్రాన్ని రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.