‘బాహుబలి’ చెత్తగా ఉందని.. డస్ట్‌బిన్‌లో పడేయమన్న నెట్‌ఫ్లిక్స్.. నెటిజన్ల ఫైర్

  • IndiaGlitz, [Thursday,March 18 2021]

సినీ ఇండస్ట్రీ అంటే ‘బాహుబలి’కి తర్వాత.. ముందు అన్నట్టుగా మారిపోయాయి పరిస్థితులు. నిజానికి ఈ సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇదొక సెన్సేషన్. తెలుగు సినిమా ఖ్యాతిని ఇంటర్నేషనల్ లెవల్‌కు తీసుకెళ్లిన ఘనత ‘బాహుబలి’కే దక్కుతుంది. ఇండియన్ బిగ్గెస్ట్ సినిమాలుగా ‘బాహుబలి’ రెండు పార్టులూ నిలిచాయి. ఈ సినిమాలు రిలీజ్ అయ్యి ఏళ్లు గడుస్తున్నా కూడా ఆ సినిమాకు గానీ.. నటీనటులకు గానీ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. పాన్ ఇండియా సినిమాకు అసలు సిసలైన అర్థాన్ని దర్శకధీరుడు రాజమౌళి చూపించారు. దీనికున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని అటు రాజమౌళి, ఇటు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ దీన్ని వెబ్‌సిరీస్‌గా తీసుకురావాలనుకున్నారు. దీంతో బాహుబలి మొదటి భాగానికి ముందు మాహిష్మతి రాజ్యం ఎలా ఉంది? శివగామి పాత్ర ప్రత్యేకతలు, ఇలా తదితర అంశాలను ఇందులో ప్రస్తావించారు. ఈ మేరకు కథ రెడీ చేయించడమే కాక 'బాహుబలి: బిఫోర్‌ ద బిగినింగ్‌' అనే టైటిల్‌ సైతం ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. ఈ సిరీస్‌ను భారీ స్థాయిల్‌ షూట్‌ చేశారు కూడా! కానీ ఫైనల్‌ కట్‌ చూసేసరికి అంతా చెత్తచెత్తగా వచ్చిందట.

ప్రవీణ్ సత్తారు, దేవకట్టాలకు బాధ్యతలు..

అనుకున్నదే తడవుగా ప్రస్తుతం తనకు సమయం లేకనో మరో కారణమో కానీ ఈ సిరీస్‌కు సంబంధించిన బాధ్యతలను ప్రవీణ్ సత్తారు, దేవకట్టాలకు రాజమౌళి అప్పగించారు. ఆనంద్ నిలకంఠ రాసిన కథ ఆధారంగా ‘ద రైజ్ ఆఫ్ శివగామి’, ‘చతురంగా’, ‘ద క్వీన్ ఆఫ్ మాహిష్మతి’ అధ్యాయలను సిరీస్‌లో చూపించడానికి అవసరమైన కసరత్తులు చేసి రంగంలోకి దిగారు. ఊహించిన దానికంటే భారీగానే షూట్ చేశారు. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఫైనల్‌ కట్ చూసుకున్న తర్వాత నెట్‌ఫ్లిక్స్‌ యాజమాన్యానికి ఈ వెబ్ సిరీస్ అస్సలు నచ్చలేదట. చెత్తగా ఉందంటూ.. తీసుకెళ్లి డస్ట్‌బిన్‌లో వేయమని తెలిపిందట. వంద కోట్ల పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరైందంటూ విరుచుకుపడిందని సమాచారం. ప్రస్తుతం ఈ నెట్‌ఫ్లిక్స్‌ విషయం కాస్తా అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

వేరే డైరెక్టర్‌తో...

ఈ వెబ్ సిరీస్ నచ్చలేదంటే ఎందుకు నచ్చాలేదో చెప్పాలి.. తమకు అవసరమైనట్టుగా తిరిగి మార్పులు చేర్పులు చేయించుకోవాలి.. అంతేకానీ ఈ హంగామా ఏంటంటూ నెట్‌ఫ్లిక్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతానికి రెండు రకాల ఆలోచనలు చేస్తోందని టాక్. ఇక ఈ తెలుగు దర్శకులొద్దు బాబోయ్ అనుకున్న నెట్‌ఫ్లిక్స్‌ మళ్లీ 150 కోట్ల రూపాయిల బడ్జెట్‌తో మళ్లీ మొదట్నుంచి వేరే డైరెక్టర్లతో పని కానిచ్చేయాలని యాజమాన్యం భావిస్తోందట. ఇక రెండోదేంటంటే.. డైరెక్ట్‌గా రాజమౌళినే రంగంలోకి దింపాలని నెట్‌ఫ్లిక్స్‌ భావిస్తోందట. త్వరలోనే ఆయన్ను సంప్రదించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై జక్కన్న ఏమంటారోననేది తెలియాల్సి ఉంది. గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వ్యవహారంపై అటు నెట్‌ఫ్లిక్స్‌ కానీ.. ఇటు ప్రవీణ్ సత్తారు, దేవకట్టాలుగానీ రియాక్ట్ అయితే తప్ప అసలు విషయం తెలిసే అవకాశం లేదు.

More News

ఎన్టీఆర్‌తో ఐశ్వ‌ర్యా రాజేష్‌..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో కోలీవుడ్‌లో విల‌క్ష‌ణ న‌టిగా పేరు సంపాదించుకుని ఇప్పుడిప్పుడే తెలుగులో అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటోన్న తెలుగు అమ్మాయి ఐశ్వ‌ర్యా రాజేశ్ జోడీ క‌డుతుందా?

మళ్లీ జగన్ మార్క్.. ఆసక్తికరంగా మేయర్, డిప్యూటీ పదవులు

ఏపీలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఆసక్తికరంగా మారాయి. ‘నొప్పించక.. తానొవ్వక’ అన్నట్టుగా వైసీపీ అధినేత వ్యవహారాన్ని చక్కబెట్టినట్టు కనిపిస్తుంది. ఆశావహులు ఎక్కువగా ఉన్నచోట

అనుదీప్ దర్శకత్వంలో మెగా మేనల్లుడు?

ఒకరు ‘జాతిరత్నాలు’తో పేరు తెచ్చుకుంటే.. ఒకరు ‘ఉప్పెన’తో పేరు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందని టాక్. ‘పిట్టగోడ’ సినిమాతో వచ్చి..

స్కూళ్ల నిర్వహణ, పరీక్షలపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం!

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా స్కూళ్లలో కరోనా విజృంభిస్తోంది. పిల్లలతో పాటు ఉపాధ్యాయులు సైతం కరోనా బారిన పడుతున్నారు.

ఇషా చావ్లా అంధురాలి పాత్రలో 'అగోచ‌ర'

తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన ఢిల్లీ బ్యూటీ ఇషా చావ్లా ప్రధాన పాత్రలో రూపొందుతున్న `అగోచ‌ర` చిత్రంలో ఒక భిన్నమైన పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది.