జక్కన్నా.. ఏంటిది.. ఎందుకింత సస్పెన్స్!?

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న మరోసారి తన రికార్డులు తానే బద్దలు కొట్టుకునే దిశగా RRRను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకూ చిన్న పాటి లుక్‌గానీ.. కనీసం ఆర్ఆర్ఆర్‌కు అర్థమేంటో కూడా దర్శకుడు చెప్పకపోవడం గమనార్హం. ఇవన్నీ అటుంచితే ఇవాళ న్యూ ఇయర్ కావడంతో కనీసం ఈ ఏడాది అయినా రిలీజ్ చేస్తారని మెగాభిమానులు, నందమూరి అభిమానులు, జక్కన్న వీరాభిమానులు వేయి కళ్లతో వేచి చూశారు. అంతేకాదు.. సినిమాకు సంబంధించి పోస్టర్ ప్రిపేర్ చేస్తున్నారని నెల కిందటి నుంచే వార్తలు గుప్పుమన్నాయ్. కానీ.. ఊరించి ఊరించి జక్కన్న మాత్రం ఉసూరుమనిపించడం గమనార్హం.

సింపుల్‌గా హ్యాపీ న్యూ ఇయర్ 2020 అంటూ పాత ఫొటోను కాస్త కొత్తగా విడుదల చేసింది చిత్రబృందం. దీంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్, ఔత్సాహికులు బాగా హర్ట్ అయ్యారు. ఈ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. ‘జక్కన్నా.. ఇది చాలా దారుణం’ అంటూ తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. మరో బ్రహ్మానందం ప్రస్టేషన్‌తో ఉన్న ఎమోజీలు, జిఫ్ ఇమేజీలను పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు.. రజనీకాంత్, రష్మిక మందన్నా డైలాగ్స్‌ ఫొటోలపై రాసి పోస్ట్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. న్యూ ఇయర్ వేళ ఏదో అనుకుని జక్కన్న అండ్ టీమ్ విష్ చేస్తే.. చీవాట్లు మాత్రం గట్టిగానే పడుతున్నాయ్. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందో..? అసలు ఎందుకింత సస్పెన్స్ పెడుతున్నారో ఏంటో రాజమౌళికే తెలియాలి మరి.

More News

'నమస్తే నేస్తమా' జ‌న‌వ‌రి 3న విడుదల

యానిమల్స్ మెయిన్ క్యారెక్టర్ లో రూపొందిన చిత్రాల‌న్నిసూపర్ హిట్స్ సాధించాయి. ఒక డాగ్ ప్రధాన పాత్రలో జాకీ ష్రాఫ్ హీరోగా కె. సి బొకాడియా అందించిన 'తేరి మెహెర్బానియా'  

న్యూ ఇయర్ వేడుకల్లో శ్రద్ధాకు చేదు అనుభవం!

న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు వేడుకలకు కొదవుండదు. డబ్బులు పోయినా సరే.. యూత్‌కు ఇవాళ వచ్చే కిక్కే వేరు..

‘కాంగ్రెస్‌ను తీసి పారేయలేం.. జగన్‌తో మంచి సంబంధాలున్నాయ్’

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తీసిపారేయలేమని.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తమకు మంచి సంబంధాలున్నాయని మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.

`హిట్‌` ఫ‌స్ట్ గ్లింప్స్‌.. ఫిబ్ర‌వ‌రి 28న విడుద‌ల

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై `ఫ‌ల‌క్‌నుమాదాస్` వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో

‘జగన్‌కు ఓటేశారు.. ఇప్పుడు నేను పోరాటం చేయాలా!?’

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు.! అయితే ఆ రెండూ కనిపించకుండా బయటికి మాత్రం నవ్వుతూనే మాట్లాడారు.