దానికి స‌పోర్ట్‌గా న‌టి న్యూడ్ ఫొటోలు.. నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు

  • IndiaGlitz, [Wednesday,January 06 2021]

సాధార‌ణంగా సోష‌ల్ మీడియాలో ఎవరైనా న‌టి న్యూడ్ ఫొటోల‌ను షేర్ చేస్తే ఇదేంటి? ఇలా ఎందుకు చేస్తుంది? అని అయినా అనుకుంటారు. కొంద‌రు చూసి న‌య‌నానందం పొందుతారు. కానీ మ‌ల‌యాళ‌, బాలీవుడ్‌లో న‌టించిన న‌టి వ‌నితా కార‌త్ చేసిన న్యూడ్ ఫోటోల‌ను చూసి నెటిజ‌న్స్ ప్ర‌శంసిస్తున్నారు. ఇంత‌కీ వారు ఎందుకు ఆమెను ప్ర‌శంసిస్తున్నారు. ఇంత‌కీ ఆమె అంత‌లా ఏం చేసింది? అనే వివ‌రాల్లోకి వెళితే.. బాడీ షేమింగ్‌కు వ్య‌తిరేకంగా బాడీ పాజిటివిటీ అనే దాన్ని అంద‌రూ స్ప్రెడ్ చేస్తున్నారు. మ‌న శ‌రీరం మ‌న ఇష్టం. నేను ఇలాగే ఉండ‌టాన్ని ఇష్ట‌ప‌డ‌తాను అనే దాన్ని బ‌లంగా చెప్ప‌డ‌మే బాడీ పాజిటివిటీ అంటారు.

ఇలా బాడీ పాజిటివిటీ గురించి చెప్ప‌డానికి వ‌నితా కార‌త్ చేసిన ప్ర‌య‌త్న‌మే ఈ న్యూడ్ ఫోటోల‌ను అప్‌లోడ్ చేయ‌డం. గాలిప‌టంను అడ్డంగా పెట్టుకుని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో వ‌నితా కార‌త్ చేసిన ఈ ఫొటోల‌ను చూసి.. ఓ మంచి ప‌ని కోసం ఆమె చేసిన ప్ర‌య‌త్నానికి నెటిజ‌న్స్ ప్ర‌శంసిస్తున్నారు. తెలుగులో బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన అర్జున్ రెడ్డిని, షాహిద్ క‌పూర్ హీరోగా క‌బీర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తే .. అక్క‌డ కూడా సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది. ఈ కబీర్‌సింగ్ చిత్రంలో వ‌నితా కార‌త్ ప‌ని మ‌నిషి పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.