వామ్మో.. ఢిల్లీలో ఇంతచేసినా కమలం వాడిందే..!

ఢిల్లీ ఎన్నికల్లో అన్నీ అనుకున్నట్లే జరిగిపోయాయ్.. అందరూ అనుకున్నట్లుగా.. ఎగ్జిట్‌పోల్స్ చెప్పినట్లుగానే ఢిల్లీని ‘చీపురు’తో ఊడ్చేశారు. అయితే.. ఏదో జరిగిపోతుంది.. గెలిచేస్తాం.. అన్న ‘కమలం’ వాడిపోయింది. ఇక ‘హస్తం’ అయితే అడ్రస్ లేకుండా పోయింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో.. అసలు ఈ ఎన్నికల్లో ఏమేం చేసింది..? ఎవరెవర్ని బరిలోకి దింపి ప్రచారం చేయించింది..? అనేదానిపై ఓ ఆసక్తికర, కీలక సందేశం వైరల్ అవుతోంది.

గుజరాత్ నుండి నాగపూర్ వరకు భయపెడుతున్న కేజ్రీవాల్...!

ఒక్క కేజ్రీవాల్ ను ఓడించడానికి గుజరాత్ గుత్తేదార్లు అంబానీ, ఆదాని, నాగపూర్ పెద్దమనుషులంతా కలిసి ఒక సాధారణ ముఖ్యమంత్రి కనీసం ఒక కానిస్టేబుల్ ను బదిలీ చేసే అధికారంలేని డిల్లీ ముఖ్యమంత్రిని ఓడించడానికి రాత్రి పగలు నిద్రాహారాలు మాని ఢిల్లీ గల్లిల్లో... 10 మంది బీజేపీ ముఖ్యమంత్రులు, 200 మంది బీజేపీ ఎంపీలు, 70 మంది బిజెపి
మంత్రులు..! ప్రచారం చేశారు. అంటే నియోజకవర్గానికి ఒక మంత్రి.. లక్షలాదిమంది భాజపా కార్యకర్తలు..!! వేల కోట్ల రూపాయలు, మంచి నీళ్ల ప్రాయంగా ఖర్చులు...!

కేజ్రీవాల్ గెలిస్తే పాకిస్థాన్ గెల్చినట్టే..!

డిల్లీ ఎన్నికలు పాకిస్థాన్‌కు, మోదీకి మద్య జరుగుతున్న ఎన్నికలు...!!. ఇది కేవలం 70 అసెంబ్లీ సీట్లున్న ఢిల్లీలో ఒక సాధారణ బక్కపల్చని ప్రజల ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఓడించడానికి.. మోదీ,షాల నాయకత్వాన ఇన్ని ఆపసోపాలా...? బీజేపీ ఓటమికి భయపడుతుంది. ఓటమికి భయపడేది ఫాసిస్టులు మాత్రమే..!. ఎప్పటికప్పుడు ప్రజలకు
తప్పుడు ప్రచారంతో సెంటిమెంట్ రెచ్చగొట్టడం ఓట్లు దండుకోవడం..ఎన్నికల అనంతరం ఏవో ప్రజల మద్య సమస్యలు సృష్టించడం పొద్దెల్లదియడం తీరా ఎన్నికల ప్రచారంలో దేశభక్తి నినాదాలు..!

ఇది బిజెపి దేశభక్త సిద్ధాంతం..!

గుజరాత్ ఎన్నికల సందర్భంగా ఇదే ప్రచారం.. ఏకంగా కాంగ్రెస్ నన్ను చంపడానికి పాకిస్థాన్‌కు సుపారీ ఇచ్చిందని కొన్ని ఫేక్ ఫోటోలు సైతం మీడియాకు విడుదల చేశారు బిజెపి నాయకులు. ఢిల్లీ కోసం ఆంతలా బిజెపి ఎందుకు భయపడుతుందంటే ప్రభుత్వ, స్కూల్స్, ప్రభుత్వ దవాఖానలు, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ప్రయాణం, వృద్ధులకు తీర్థయాత్రలు ఇన్ని చేసిన కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సహకారం ఇవ్వకపోయినా ఢిల్లీ సర్కార్ మిగులు బడ్జెట్‌తో ఉండడం బీజేపీకి మింగుడు పడని విషయంగా మారింది. ఈసారి ఢిల్లీలో కేజ్రీవాల్ వస్తే ఆయన ప్రభావం హరియాణ, పంజాబ్‌లకు పాకుతుందనేది బీజేపికి భయం. ఢిల్లీలో కేజ్రీవాల్ గెలిస్తే ఢిల్లీ పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ విద్యా, వైద్యం గెలుస్తుందని బీజేపీ బయపడింది. అయితే ఈ సందేశాన్ని చూసిన జనాలు వామ్మో అంటూ నోరెళ్ల బెడుతున్నారు.. ఇంత చేసినా కమలం వికసించకపోగా 8 సీట్లకే పరిమితం అయ్యిందని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

గమనిక: ఇది సోషల్ మీడియాలో ఓ నెటిజన్, జర్నలిస్ట్ రాసింది మాత్రమే.. అంతకుమించి www.indiaglitz.com ఎవర్ని ఉద్దేశించిగానీ .. టార్గెట్ చేస్తూ గానీ రాసింది కాదని గమనించిగలరు.

More News

‘క్రేజీ’గా హ్యాట్రిక్ కొట్టేసిన కేజ్రీవాల్..!

ఢిల్లీ ఎన్నికల్లో అన్నీ అనుకున్నట్లే జరిగాయ్.. కేజ్రీవాల్ మరోసారి కచ్చితంగా అధికారంలోకి వస్తారని తెలుసు.. అయితే ఓటింగ్ మొదలుకుని కౌంటింగ్ వరకూ ఎప్పుడేం జరుగుతుందో..?

పసుపులేటి లేరన్న వార్త బాధ కలిగించింది!

సీనియర్ సినిమా జర్నలిస్ట్ జర్నలిస్టు పసుపులేటి రామారావు కన్నుమూశారు.

పసుపులేటి రామారావు మృతి పట్ల ఫిలిం న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ సంతాపం

పసుపులేటి రామారావు  మృతి పట్ల  ఫిలిం న్యూస్ క్యాస్టర్స్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసారు.

రామారావు నా ఆత్మబంధువు.. చిరు

సీనియర్ సినిమా జర్నలిస్టు పసుపులేటి రామారావు మృతిచెందిన విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి తీవ్రదిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు.

టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిన ప్ర‌భాస్ సినిమా సెట్స్‌

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ తాజా చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న 20వ చిత్ర‌మిది.