ఈటలపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డ తెలంగాణ

ఆరోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్‌పై ట్వట్టర్ వేదికగా తెలంగాణకు చెందిన పలు జిల్లాల వాసులు మండిపడ్డారు. ఆదివారం కరోనా బులిటెన్‌ను ఈటల రాజేందర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అది చూసిన నెటిజన్లు.. అదంతా మానిప్యులేషన్ అని.. దసరా డిస్కౌంట్ ఇంకా పూర్తవలేదా? అంటూ సెటైర్ల వర్షం కురిపించారు. తమ జిల్లాలకు చెందిన వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్‌తో ఈటల విడుదల చేసిన కరోనా బులిటెన్‌ను కంపేర్ చేస్తూ.. ట్విట్టర్ వేదికగా తెలంగాణ వాసులు మండిపడ్డారు.

ఈటల ట్వీట్‌పై నిజామాబాద్ వాసి వినయ్ స్పందించారు. ‘‘ఈ రోజు నిజామాబాద్‌లో ఆరుగురు చనిపోయారని చెప్పి తర్వాత ఇద్దరు మాత్రమే కరోనాతో చనిపోయారని రెండో సారి చెప్పారు ఎందుకంటే మన ప్రభుత్వం తెలంగాణ బులిటెన్‌లో ఈ రోజు ఆరు మరణాలు ఇచ్చారు. ఒక్క నిజామాబాద్ లొనే 6గురు ఇస్తే డౌట్ వస్తదని నిజామాబాద్ బులిటెన్ చేంజ్ చేశారు గ్రేట్ సర్’’ అని రిప్లై ఇచ్చారు.

ఈటల ట్వీట్‌పై నల్గొండ జిల్లా వాసి మహేష్ స్పందించారు. తమ జిల్లాకు చెందిన డీఎంఅండ్‌హెచ్‌వో ఇచ్చిన కరోనా బులిటెన్‌ను పోస్ట్ చేసి.. దానిని ఈటల పోస్ట్ చేసిన కరోనా బులిటెన్‌తో పోల్చుతూ ట్వీట్ పెట్టారు. ‘నల్గొండలో 69? లేదంటే 26? డేటాలో చాలా పెద్ద మానిప్యులేషన్ ఉంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంపత్ అనే మరో నల్గొండ వాసి ఈటల రాజేందర్ పోస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘టెస్టులు తగ్గినా కూడా కేసుల నంబర్ మాత్రం మారలేదు.. స్మార్ట్‌గా వద్దు.. బాధ్యతగా వ్యవహరించండి. నేడు నల్గొండ డీఎంహెచ్‌వో విడుదల చేసిన బులిటెన్ ప్రకారం నల్గొండలో 69 కేసులున్నాయి. కానీ మీరు 26 మాత్రమే ఉన్నట్టు చూపిస్తున్నారు. మహమ్మారిని ఎదుర్కోవడానికి ఇది సరైన విధానం కాదు. దయచేసి పారదర్శకంగా ఉండండి’’ అని రిప్లై ఇచ్చారు.

‘‘అలాగే ఖమ్మం జిల్లాలో నేడు 37 కేసులున్నట్టు ఖమ్మం డీఎంహెచ్‌వో ఇచ్చిన రిపోర్టులో ఉంది. మీరు మాత్రం కేవలం 5 పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నట్టు చూపించారు. అదెలా?’’ అని ఈటలను ఖమ్మం జిల్లా వాసి సాయితేజ ప్రశ్నించారు.

‘‘ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి.. కోవిడ్ కేసులలో చాలా దాచేస్తున్నారు. వీళ్లెవరూ మన ప్రశ్నలకు సమాధానం ఇవ్వరు... ఎందుకంటే పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులను దాస్తున్నామని వాళ్లకు కూడా తెలుసు. కానీ వాటిని దాచి ఈ మహమ్మారి కాలంలో రాష్ట్రం బాగా పని చేస్తోందని మనల్ని నమ్మిస్తున్నారు’’ అని అనుదీప్ అనే నెటిజన్ మండిపడ్డారు.

మొత్తంగా ప్రభుత్వం చూపిస్తున్నదంతా దొంగ లెక్కలని తమ జిల్లాలకు చెందిన వైద్యశాఖ ఇస్తున్న రిపోర్టుకు.. ఈటల ఇస్తున్న రిపోర్టుకు సంబంధం లేదని నెటిజన్లు మండిపడుతున్నారు.

More News

ఏపీ అసెంబ్లీని కుదిపేస్తున్న కరోనా.. నేడు 9 మందికి పాజిటివ్..

ఏపీలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. నిన్న ఒక్కరోజే 5 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

శింబుతో సీక్రెట్‌గా పెళ్లికి సిద్ధమవుతున్న త్రిష!

అటు కోలీవుడ్‌లోనూ.. ఇటు టాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది త్రిష.

వర్మపై రివెంజ్‌కి ప్లాన్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య బయోపిక్‌ల బాట పట్టిన విషయం తెలిసిందే.

దేశంలో 11 లక్షలు దాటిన కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో...

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11 లక్షలు దాటగా..

కరోనాపై పరిశోధనలు.. ఇంట్రెస్టింగ్‌ న్యూస్ చెప్పిన ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు

ఓ వైపు కరోనా నివారణకు పరిశోధనలు జరుగుతుంటే.. మరోవైపు కరోనా బారి నుంచి కాపాడటమెలా?