త‌మ‌న్ కాపీ ట్యూన్‌.. ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్‌

  • IndiaGlitz, [Wednesday,December 16 2020]

మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ త‌మ‌న్‌కు ప్ర‌స్తుతం నెంబ‌ర్ వ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ ప‌నిచేస్తున్నాడు. చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన ఇలాంటి త‌రుణంలో త‌మ‌న్ చేసిన ఓ చిన్న త‌ప్పు.. మ‌రోసారి త‌మ‌న్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షానికి కార‌ణ‌మైంది.

ఇంత‌కీ అంత‌లా త‌మ‌న్ ఏం చేశాడు? అనే వివ‌రాల్లోకి వెళ్తే, త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న చిత్రాల్లో ర‌వితేజ క్రాక్ సినిమా కూడా ఒక‌టి. రీసెంట్‌గా ఈసినిమా నుండి సెకండ్ సాంగ్‌ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. ఈ పాట‌లో ఓ బీట్‌ను లాటిన్ సినిమా నుండి త‌మ‌న్ కాపీ కొట్టిన‌ట్లు తెలిసింది. ఇక నెటిజ‌న్స్ ఊరుకుంటారా? త‌మ‌న్‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రోల్ చేయ‌డం మొదలు పెట్టారు.

సాంగ్ లాటిన్ అయితే క్రెడిట్ త‌మ‌న్‌దంటూ ఒక‌రంటే.. త‌ప్పించుకుందామ‌నుకున్నాడేమో కానీ వీలు కాలేదని మ‌రొక‌రు కామెంట్ చేశారు. ఇంకొక‌రు అయితే కింగ్ సినిమాలో నాగార్జున‌, బ్ర‌హ్మనందం కామెడీ బిట్‌ను క‌ట్ చేసి పోస్ట్ చేశారు.

ఈ సాంగ్‌కు వ‌న్ మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చినందుకు సంతోషించాలో, లేక ఇలా అడ్డంగా దొరికిపోయినందుకు బాధ‌ప‌డాలో త‌మ‌న్‌కు అర్థం కావ‌డం లేదు. ఇక క్రాక్ సినిమా విషయానికి వ‌స్తే మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టించిన ఈ సినిమాలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. సంక్రాంతి సంద‌ర్భంగా సినిమా ప్రేక్ష‌కుల మందుకు రానుంది.

More News

డిజిట‌ల్ ఎంట్రీ ఇస్తున్న హ‌న్సిక‌

స‌మంత‌, త‌మ‌న్నా స‌హా ప‌లువురు స్టార్స్, టెక్నీషియ‌న్స్ డిజిట‌ల్ రంగం వైపు అడుగులేస్తున్నారు. సిల్వ‌ర్ స్క్రీన్‌కు స‌మాంత‌రంగా ఎదుగుతున్న డిజిట‌ల్ రంగం వైపు అంద‌రూ కొత్త త‌ర‌హా పాత్ర‌ల‌ను చేయ‌డానికి

విలేజ్ డాన్ క్యారెక్టర్‌లో సముద్రఖని

యువ వ్యాపారవేత్త, 'క్రియేటివ్‌ మెంటార్స్‌ యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ కాలేజీ' మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) కొవ్వూరి సురేష్‌రెడ్డి సినిమా నిర్మాణంలో

‘షకీలా’ ట్రైలర్ విడుదల...

ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వంలో రిచా చద్దా.. పంకజ్ తివారి ప్రధాన పాత్రల్లో రూపొందిన బయోపిక్ ‘షకీలా’ ట్రైలర్ నేడు విడుదలైంది.

మెగా ఫ్యామిలీలో త్వరలో మరో పెళ్లి..

మెగా డాటర్ నిహారిక వివాహ వేడుకల ఇటీవలే ముగిసింది. మెగా ఫ్యామిలీ మొత్తం ఆ పెళ్లిలో చేసిన సందడి అంతా ఇంతా కాదు.

రజినీ అభిమానుల్లో ఉన్న ఆనందం.. సాయంత్రానికి ఆవిరి..

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ పార్టీ పెడుతున్న విషయం కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఊహాగానాలకు కొదువ లేకుండా పోతోంది.