రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్‌, కొర‌టాల శివ, పూరి

సినిమా ప‌రిశ్ర‌మ‌లో రెండు త‌ర‌గ‌తులు ఎప్ప‌టికీ ఉంటాయి. అందులో కొంద‌రు యాక్టివ్ మెంబ‌ర్స్ ఉంటే.. ఎక్కువ శాతం నాన్ యాక్టివ్ మెంబ‌ర్స్ ఉంటారు. ఈ నాన్ యాక్టివ్ మెంబ‌ర్స్ ప్ర‌తి డిపార్ట్మెంట్‌లో ఉండి అది త‌ప్పు..ఇది త‌ప్పు అని చెబుతుంటారు. ఇత‌రుల‌కు త‌ల‌నొప్పిలా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు నిర్మాతల విష‌యానికి వ‌స్తే యాక్టివ్ ప్రొడ్యూస‌ర్స్ కొంత‌మందే ఉంటారు. మిగిలినవారు అప్పుడెప్పుడో మేం సినిమాలు తీశాం క‌దా! మేం కూడా నిర్మాత‌ల‌మే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తుంటారు. దీనిపై యాక్టివ్ నిర్మాత‌ల మండ‌లి ఎర్ప‌డింది. ఇప్పుడు ద‌ర్శ‌కుల సంఘంలో కూడా ఇలాంటి మార్పే రాబోతుంద‌ని స‌మాచారం.

సినిమాల‌ను రెగ్యుల‌ర్‌గా తెర‌కెక్కించే రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్‌, కొర‌టాల శివ, పూరి వంటి కొంద‌రు ద‌ర్శ‌కులు ఓ గ్రూపుగా ఏర్ప‌డ్డార‌ని, రెగ్యుల‌ర్ డైరెక్ట‌ర్స్ గ్రూపులో ఉంటూనే యాక్టివ్ డైరెక్ట‌ర్స్ గ్రూపును కొన‌సాగిస్తార‌ని టాక్ విన‌ప‌డుతుంది. భ‌విష్య‌త్తులో కీల‌క నిర్ణ‌యాల‌ను తీసుకోవ‌డానికి వీరు కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని అంటున్నారు. మ‌రి ఈ వార్త‌ల్లో నిజ‌మెంతో తెలియాలంటే దర్శ‌కుల సంఘం నుండి ఎవ‌రైనా స్పందిస్తేనే క‌రెక్ట్‌.

More News

తొందర‌‌పడొద్దంటున్న బ‌న్నీ... ఇన్‌స్టాలో బ‌న్నీ హ‌వా

క‌రోనా ఎఫెక్ట్‌తో కొనసాగుతున్న లాక్‌డౌన్ వ‌ల్ల సినిమాల షూటింగ్స్‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఓకే చెప్పింది. విధి విధానాలు ప్ర‌క‌టించాల్సి ఉంది.

తెలంగాణ‌లో షూటింగ్స్‌కు కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్‌

కోవిడ్ 19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అనుమతి ఇచ్చారు.

వెబ్‌ ఆడియన్స్‌ మనసులు గెలిచి పెద్ద విన్నర్‌గా నిలిచిన 'లూజర్‌'

భారతదేశంలోనే అత్యధికంగా ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌లు/కంటెంట్‌ ప్రొడ్యూస్‌ చేస్తున్న డిజిటల్‌ ఫ్లాట్‌ఫార్మ్‌ 'జీ 5'. ఇందులో 100కు పైగా ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌లు ఉన్నాయి.

మ‌రోసారి ‘ఢీ’ కొట్ట‌బోతున్నారా..?

మంచు విష్ణు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన కమర్షియల్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఢీ’. విష్ణుకు తొలిసారి బ్రేక్ దక్కిన చిత్రమిది. తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో

బ్రేకింగ్ : సీఎం కేజ్రీవాల్‌కు అస్వస్థత.. రేపు కరోనా టెస్ట్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ అస్వస్థతకు లోనయ్యారు. కరోనా లక్షణాలు అయిన జ్వరం, తలనొప్పి ఉండటంతో అప్రమత్తమైన సీఎం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.