కిరాక్ ఆర్.పి ద‌ర్శ‌క‌త్వంలో నూత‌న‌ చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Sunday,August 23 2020]

జ‌బ‌ర్ధ‌స్థ్ కామెడీ షోతో తెలుగు ప్ర‌జ‌ల‌కి సుప‌రిచిత‌మైన క‌మీడియ‌న్ కిరాక్ ఆర్.పి ద‌ర్శ‌కునిగా మారారు. శ్రీ ప‌ద్మ‌జ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై కోవూరు అరుణాచ‌లం నిర్మాత‌గా కిరాక్ ఆర్.పి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ప్రొడ‌క్ష‌న్ నెం 1 సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ను జే.డి చ‌క్ర‌వ‌ర్తి పోషిస్తున్నారు. ప‌ద్మ‌జ పిక్చ‌ర్స్ మూవీ ఆఫీసులో జ‌రిగిన పూజా కార్య‌క్ర‌మానికి వెండితెర‌, బుల్లితెర రంగాల‌కి చెందిన వివిధ ప్ర‌ముఖులు విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ ప్రారంభోత్స‌వానికి విచ్చేసిన వారిలో జే.డి.చ‌క్ర‌వ‌ర్తితో పాటు, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు, జ‌బ‌ర్ధ‌స్థ్ కామెడీ షోకి చెందిన ఆర్టిస్టులు ఉన్నారు. ఈ సంద‌ర్భంగా

ద‌ర్శ‌కుడు కిరాక్ ఆర్.పి మాట్లాడుతూ.. గ‌త కొన్నేళ్లుగా జ‌బ‌ర్ధ‌స్థ్ కామెడీ షో ద్వారా న‌న్ను ఆద‌రించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కి కృత‌జ్ఞ‌త‌లు. సస్పెన్స్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంగా ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ కుద‌ర‌డంతో ద‌ర్శ‌కునిగా ఆడియెన్స్ ముందుకి రావ‌డానికి నిశ్చ‌యించుకున్నాను. నా మీద న‌మ్మ‌కంతో నిర్మాత కోవూరు అరుణాచలం గారు సినిమాని నిర్మించ‌డానికి ముందుకొచ్చారు. ప‌ద్మ‌జ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 1 గా, నా డైర‌క్ష‌న్ లో తెరెకెక్కుతున్న ఈ సినిమాలో జేడీచ‌క్ర‌వ‌ర్తి కీల‌క పాత్ర పోషించ‌‌డానికి అంగీక‌రించ‌డం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో జే.డి. పాత్ర చాలా విల‌క్ష‌ణంగా ఉంటుంది. జే.డి.చ‌క్ర‌వ‌ర్తితో పాటు, ప్ర‌కాశ్ రాజ్, రావుర‌మేశ్, జ‌బ‌ర్ధ‌స్థ్ ఆదిత్య త‌దిత‌రులు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌లో హైద‌రాబాద్, నెల్లూర్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా తెలిపారు.

తారాగాణం ; జే.డి.చ‌క్ర‌వ‌ర్తి, ప్ర‌కాశ్ రాజ్, రావుర‌మేశ్, జ‌బ‌ర్ధ‌స్థ్ ఆదిత్య త‌దిత‌రులు

More News

చిరకాల మిత్రుడు పంపిన గిఫ్ట్‌తో ఫోటో తీసుకుని మురిసిపోతున్న మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకో స్పెషల్ గిఫ్ట్ వచ్చింది. అది తన చిరకాల మిత్రుడు పంపాడని..

గుడ్ న్యూస్ చెప్పిన ‘సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’.. ఉచితంగా వ్యాక్సిన్..

భారతీయులందరికీ ‘సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ ప్రతినిధులు గుడ్ న్యూస్ చెప్పారు.

తెలంగాణలో రెండో రోజు 2 వేల మార్కును దాటేసిన కరోనా కేసులు..

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు కూడా రాష్ట్రంలో కరోనా కేసులు రెండు వేల మార్కును దాటేశాయి.

ఎస్పీ బాలు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసిన ఎంజీఎం..

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్‌ను ఎంజీఎం వైద్యులు విడుదల చేశారు.

వచ్చే నెల చివరి నాటికి అందుబాటులోకి రష్యా వ్యాక్సిన్!

కరోనా వ్యాక్సిన్ విషయంలో రష్యా ప్రపంచ దేశాలన్నింటికన్నా ముందున్న విషయం తెలిసిందే. సడెన్‌గా కరోనా వ్యాక్సిన్‌కి అనుమతి లభించిందని వెల్లడించి షాక్ ఇచ్చిన రష్యా..