కొత్త హీరోలు... ప‌రిచ‌య‌మ‌య్యారు!

కొత్త హీరోలు... ప‌రిచ‌య‌మ‌య్యారు!

సినిమా ప‌రిశ్ర‌మ‌కు హీరో డామినేటెడ్ ఇండ‌స్ట్రీ అనే పేరు కూడా చ‌లామ‌ణిలో ఉంది. సినిమా ఓకే కావాలంటే ముందు హీరో ఎవ‌ర‌నేది తెలియాలి. హీరోకు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాంటి హీరో పొజిష‌న్ లో త‌మ‌ను తాము చూసుకోవాల‌ని ఎంద‌రో కుర్ర‌కారు క‌ల‌లు కంటుంటారు. ఫిల్మ్ న‌గ‌ర్ చుట్టూ కాళ్ల‌రిగేలా తిరిగిన వారిలో త‌ప్ప‌కుండా కొంద‌రినైనా 2018 హీరోల‌ను చేసి ఉంటుంది. వీరిది ఒక దారి అయితే ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, టెక్నీషియ‌న్ల వార‌స‌లు కూడా హీరోలుగా ప‌రిచ‌య‌మైన వారున్నారు. ఒక ప‌రిశ్ర‌మ‌లో హీరోగా నిల‌దొక్కుకుని, మ‌రో ప‌రిశ్ర‌మ‌లోకి 2018లో హీరోలుగా ఎంట‌ర్ అయిన వాళ్లు కూడా ఉంటారు. ఎలాగైతేనేం ఈ ఏడాది సుమారు 175 సినిమాలు విడుద‌లైతే అందులో ఎంత లేద‌న్నా 75 మందిదాకా కొత్త హీరోలే న‌టించారు. డిసెంబ‌ర్ తొలివారం వ‌ర‌కు 63 చిత్రాల్లో కొత్త హీరోలున్నారు. వారిలో కాస్త‌యినా ఇంపాక్ట్ చూపించిన హీరోలు, క్రేజ్‌తో సినిమాలు విడుద‌లైన హీరోల గురించి ఓ లుక్కేద్దాం...

దుల్క‌ర్ స‌ల్మాన్‌

దుల్క‌ర్ స‌ల్మాన్‌

మ‌మ్ముట్టి త‌న‌యుడు దుల్క‌ర్ స‌ల్మాన్ మ‌న‌కు కొత్తేమీ కాదు. 2015లో మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన `ఓకే బంగారం` సినిమాతోనే తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడ‌య్యాడు. అయితే అది అనువాద చిత్రం. దుల్క‌ర్ న‌టించిన తొలి తెలుగు చిత్రం `మ‌హాన‌టి`. నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో జెమిని గ‌ణేశ‌న్ పాత్ర‌లో, అమ్మ‌ణి అమ్మ‌ణి అంటూ చ‌క్క‌గా న‌టించారు. ఆయ‌న తెలుగులో మాట్లాడిన విధానం కూడా ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత దుల్క‌ర్ స్ట్రెయిట్ తెలుగు చిత్రాలేవీ సంత‌కం చేయ‌లేదు. అయినా ఆయ‌న ప‌రిచ‌య‌మైన తొలి చిత్రం మాత్రం పెద్ద హిట్ అయి, అత‌నికి మంచి పేరునే తెచ్చిపెట్టింది.

క‌ల్యాణ్ దేవ్‌

క‌ల్యాణ్ దేవ్‌

మెగాస్టార్ కాంపౌండ్ నుంచి వ‌చ్చిన మ‌రో హీరో క‌ల్యాణ్ దేవ్‌. మెగాస్టార్ చిరంజీవి రెండో అల్లుడు క‌ల్యాణ్ దేవ్‌. మామ‌గారి సినిమా పేరు 'విజేత‌'ను త‌న తొలి సినిమాకు పెట్టుకున్నారు. క‌థా ప‌రంగా కూడా 'విజేత' టైటిల్ సూట్ కావ‌డంతో ఆయ‌న ఆ పేరునే ఎంపిక చేసుకున్నారు. తొలి సినిమాతోనే ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయ‌న హీరోగా మ‌రో సినిమా సెట్స్ మీద ఉంది.

రాహుల్ విజ‌య్‌

రాహుల్ విజ‌య్‌

విజ‌య్ మాస్ట‌ర్ త‌న‌యుడిగా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన న‌టుడు రాహుల్ విజ‌య్‌. రాహుల్ తొలి సినిమాను ఆయ‌న సోద‌రి దివ్య విజ‌య్ నిర్మించారు. తొలి సినిమా కోసం ప్రేమ క‌థ‌ను ఎంపిక చేసుకున్నారు. డైలాగులు చెప్ప‌డంలో, ఫైట్లు చేయ‌డంలో, డ్యాన్సులు వేయ‌డంలో కుర్రాడు ఫ‌ర్వాలేదు అని విమ‌ర్శ‌కుల చేత మంచి ప్ర‌శంస‌లే ద‌క్కించుకున్నారు.

ఆకాష్ పూరి

ఆకాష్ పూరి

వీళ్ల‌ది రెండోది.. అయినా ఒక‌టోదే!

'మెహ‌బూబా'... హీరో ఆకాష్ పూరికి తొలి చిత్రం కాదు. అలాగే 'ఆర్‌.ఎక్స్.100' కార్తికేయ‌కు తొలి చిత్రం కాదు. అయినా ఈ చిత్రాలే వాళ్ల‌కు హీరోలుగా ప్రాప‌ర్ లాంచింగ్ కింద విడుద‌ల‌య్యాయి.

పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరి చిన్న‌త‌నం నుంచి ఎన్నో సినిమాలు చేస్తూనే ఉన్నారు. టీనేజ్ ల‌వ్ స్టోరీ 'ఆంధ్రా పోరి'లోనూ హీరోగా న‌టించారు. అయితే పూర్తి స్థాయి అత‌ని లాంచింగ్ చిత్రంగా పూరి జ‌గ‌న్నాథ్ ప్ర‌క‌టించిన 'మెహ‌బూబా' ఈ ఏడాదే విడుద‌లైంది. ఎక్కువ భాగం ఉత్త‌రాదిన ల‌డ‌ఖ్ త‌దిత‌ర ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుపుకున్న సినిమా ఇది. ఇండియ‌న్ మిలిట‌రీకి సెల‌క్ట్ అయిన కుర్రాడిగా ఆకాష్ క‌నిపించాడు. అయితే ఈ సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి అనుకున్నంత గొప్ప స్పంద‌న మాత్రం రాలేదు. అయినా ఆకాష్ పూరికి మాత్రం క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఈజ్ ఉన్న హీరోగా ఆకాష్ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందారు.

కార్తికేయ

కార్తికేయ

హీరో కార్తికేయ న‌టించిన ఆర్‌.ఎక్స్. 100 సినిమా ఈ ఏడాది సంచ‌ల‌న విజ‌యం సాధించింది. యువ‌త‌కు న‌చ్చిన కంటెంట్‌తో, మ‌రింత బోల్డ్ చిత్రంగా విడుద‌లైన సినిమా ఆర్‌.ఎక్స్.100. విడుద‌ల‌కు ముందే చిత్ర యూనిట్‌కు సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. సినిమా విడుద‌ల‌య్యాక ఆ అంచ‌నాలు నిజ‌మై మంచి ఫలితాల‌ను అందించాయి. ఈసినిమాతో కార్తికేయ‌కు పొరుగున కోలీవుడ్‌లోనూ మంచి పేరు వ‌చ్చింది.

కేరాఫ్ కంచ‌ర‌పాళెం

కేరాఫ్ కంచ‌ర‌పాళెం చిత్రంలో న‌టించిన వారంద‌రూ కొత్త‌వారే. అయినా ఆ సినిమా కూడా ఆర్‌.ఎక్స్.100కు పోటాపోటీగా వ‌సూళ్లు తెచ్చుకుంది. ఈ సినిమాతోనూ సుబ్బారావు, కేశ‌వ‌, కార్తిక్ అంద‌రి మ‌న్న‌న‌లు పొందారు. ఇన్ని సినిమాలు విడుద‌లైన‌ప్పుడు వారిలో నిల‌దొక్కుకునే హీరోలుగా, తొలి సినిమాతోనే బ్యాంగ్ తో వ‌చ్చే హీరోలుగా కొంద‌రు క‌నిపిస్తుంటారు. అయితే ఈ సారి కొత్త‌గా వ‌చ్చిన వారిలో అటు ప్రేక్ష‌కుల‌కు, ఇటు క్రిటిక్స్ కు న‌చ్చిన వారి సంఖ్య చేతి మీద లెక్కేసేట‌ట్టే ఉండ‌టం గ‌మ‌నార్హం. క‌నీసం 2019లో అయినా నిల‌దొక్కుకునే కొత్త హీరోల సంఖ్య మెరుగ్గా ఉంటుంద‌ని ఆశిద్దాం.

కొత్త‌గా ప‌రిచ‌య‌మైన వారు.. (డిసెంబ‌ర్ తొలి వారం వ‌ర‌కు)

1.సీహెచ్ రేవంత్ (సార‌థి)

2. స‌త్యానంద్ (3ముఖి)

3. స‌ల్మాన్ (హెచ్‌.బి.డి)

4. విద్యాసాగ‌ర్ రాజు ( ర‌చ‌యిత‌)

5. రంజిత్ (జువ్వ‌)

6. శివ తాండేల్ (వాడేనా)

7. స‌తీష్ రెడ్డి (నెల్లూరు పెద్దారెడ్డి)

8. అలీ రాజా (నా రూటే సెప‌రేటు)

9. ఇంద్ర‌నీల్ సేన్ గుప్తా (ఐతే 2.0)

10. నిరూప్ భండారి (రాజ‌ర‌థం)

11. ప్ర‌త్యూష్ (స‌త్య‌గాంగ్‌)

12. తేజ‌స్‌, వంశీ కోడూరి (అమీర్ పేట్ టు అమెరికా)

13. త‌ల్లాడ సాయికృష్ణ (ఎంద‌రో మ‌హానుభావులు)

14. ర‌వికాంత్ (జంక్ష‌న్‌లో జామ‌య్యింది)

15. దుల్క‌ర్ స‌ల్మాన్ (మ‌హాన‌టి)

16. ఆకాష్ పూరి (మెహ‌బూబా)

17. శ్రీనివాస‌రావు (శ్రీనుగాడి ప్రేమ‌)

18. అభి (స‌హ‌చ‌రుడు)

19. శ్రీక‌ర‌ణ్ (బెస్ట్ ల‌వ‌ర్స్)

20. మ‌హీధ‌ర్ (నా ల‌వ్ స్టోరీ)

21. హోమానంద్ (మిస్ట‌ర్ హోమానంద్)

22. శ‌ర‌త్ చంద్ర (ఐపీసీ సెక్ష‌న్‌)

23. ఎం. న‌ర్సింగ్ (సూప‌ర్ స్కెచ్‌)

24. ఆర్‌. యువ‌రాజ్ (అఘోరా)

25. సురేశ్ క‌మ‌ల్ (దివ్య‌మ‌ణి)

26. క‌ల్యాణ్ దేవ్ (విజేత‌)

27. కార్తికేయ (ఆర్‌.ఎక్స్.100)

28. మ‌హ‌దేవ్ (నివురు)

29. ఉద‌య శంక‌ర్ (ఆట‌గ‌ద‌రా శివ‌)

30. విరాట్ కొండూరు (ప‌రిచ‌యం)

31. రావ‌ణ్ రెడ్డి (పెద‌వి దాట‌ని మౌనం)

32. సుజ‌య్‌, చంద్ర‌కాంత్ (నాకూ మ‌న‌సుంది)

33. రాజేశ్ శ్రీ చ‌క్ర‌వ‌ర్తి (శివ‌కాశీపురం)

34. సుమంత్ శైలేంద్ర (బ్రాండ్ బాబు)

35. ప్ర‌భాక‌ర్ (మ‌న్యం)

36. మ‌యాంక్ (యువ‌త‌రం)

37. రాజా (ఆమె కోరిక‌)

38. సుజ‌య్ (ప్రేమాంజ‌లి)

39. జై (అంత‌కు మించి)

40. య‌శ్వంత్ (స‌మీరం)

41. సుబ్బారావు, కేశవ క‌ర్రి, కార్తిక్ ర‌త్న‌, మోహ‌న్ (కేరాఫ్ కంచ‌ర‌పాళెం)

42 అభిషేక్ (ప్రేమ‌కు రెయిన్ చెక్‌)

43. సంతోష్ రాజ్ (అనువంశీక‌త‌)

44. సాయి రోన‌క్ (మ‌స‌క్క‌లి)

45. వైష్ణ‌వ్ (నేనూ - నా దేశం)

46. రాహుల్ విజ‌య్ (ఈ మాయ పేరేమిటో)

47. అమ‌ర్ (అంత‌ర్వేదం)

48. మ‌హేష్ కుమార్ (అలా జ‌రిగింది)

49. నవీద్ (భ‌లే మంచి చౌక‌బేరం)

50. సంజోయ్ (బేవ‌ర్స్)

51. జొన్న ప‌ర‌మేష్ (నీ ప్రేమ కోసం_)

52. రాఘ‌వ్ (బంగారి బాల‌రాజు)

53. గీతానంద్ (ర‌థం)

54. సూర‌జ్ గొండ (2 ఫ్రెండ్స్)

55. మోహ‌న్‌, కార్తిక్‌, రాజ్‌కాంత్ (తాంత్రిక‌)

56. అక్ష‌య్‌, ర‌ఫి (రెడ్ మిర్చి)

57. అభిషేక్ వ‌ర్మ (అదుగో)

58. వ‌సంత్ స‌మీర్ ( క‌ర్త క‌ర్మ క్రియ‌)

59. ఆకాష్ కుమార్ (శ‌ర‌భ‌)

60. విక్రాంత్ సింగ్ (సైన్యం)

61. శివ‌మ‌ణి (రూల్‌)

62. మార్కండేయ (స్టూడెంట్ ప‌వ‌ర్‌)

63. శ్రీనివాస సాయి (శుభ‌లేఖ +లు)

సినిమా ప‌రిశ్ర‌మ‌కు హీరో డామినేటెడ్ ఇండ‌స్ట్రీ అనే పేరు కూడా చ‌లామ‌ణిలో ఉంది. సినిమా ఓకే కావాలంటే ముందు హీరో ఎవ‌ర‌నేది తెలియాలి.