అఖిల్ జోడీగా కొత్త హీరోయిన్‌... ఈసారైనా వ‌ర్క‌వుట్ అవుతుందా?

  • IndiaGlitz, [Thursday,December 31 2020]

అఖిల్ అక్కినేని హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. కాగా.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌నే దానిపై చిత్ర యూనిట్ ఓ క్లారిటీకి వ‌చ్చింద‌ట‌. సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. వివ‌రాల మేర‌కు ముంబైకి చెందిన సాక్షి వైద్య.. అఖిల్ జోడీగా న‌టించ‌నుందంటున్నారు. రీసెంట్‌గా ఈ అమ్మ‌డు ఫొటో షూట్‌లో పాల్గొంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు సాక్షి వైద్య‌నే తీసుకోవాల‌నుకుంటున్నార‌ని, త్వ‌ర‌లోనే ఫైన‌ల్ నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

అయితే ఇక్క‌డ అక్కినేని ఫ్యాన్స్‌ను కంగారు పెడుతున్న విష‌య‌మొక‌టి ఉంది. అదేంటంటారా!.. అఖిల్ ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సినిమాలు చేస్తే అందులో మూడు మాత్ర‌మే విడుద‌లైయ్యాయి. నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. కాగా.. ఈ నాలుగు చిత్రాల్లో రెండు సినిమాల్లో కొత్త హీరోయిన్సే న‌టించారు. అఖిల్‌లో స‌యేషా సైగ‌ల్ డెబ్యూ, హ‌లో చిత్రంలో క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌లు హీరోయిన్స్‌గా న‌టించారు. ఈ రెండు సినిమాలు డిజాస్ట‌ర్స్ అయ్యాయి. మ‌రిప్పుడు మూడోసారి మ‌రో కొత్త అమ్మాయి న‌టిస్తుంద‌ని అంటున్నారు. త‌మ అక్కినేని హీరో హిట్స్ మీద హిట్స్ కొట్టాల‌ని అనుకుంటున్నా అభిమానులు..మ‌రి ఈసారైనా అఖిల్‌కు స‌క్సెస్ వ‌స్తుందో రాదోన‌ని కంగారు ప‌డుతున్నారు.

More News

ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు పొడగింపు...

వ్యక్తిగత ఐటీ రిటర్న్‌ల దాఖలుకు సంబంధించిన గడువును మరోసారి కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.

మీ ప్రయాణం స్ఫూర్తిదాయకం: సోనూపై మెగాస్టార్ ప్రశంసలు

కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ విధించిన సమయంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ బయటకు వచ్చేందుకు ఎవరూ సాహసించలేదు.

అజారుద్దీన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్‌ బుధవారం ఉదయం కారు ప్రమాదానికి గురయ్యారు.

కొత్త సంవత్సరం రోజున రాధేశ్యామ్ టీజర్.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

రెబల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా?

చెర్రీ ఆరోగ్యంపై ఉపాసన ట్వీట్..

మెగా ఫ్యామిలీని కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది. ఒకేరోజు మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.