'ఆధార్' అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారా!?

  • IndiaGlitz, [Monday,November 11 2019]

ఇప్పుడు సర్వం ఆధార్ కార్డే. ఏ చిన్న పని చేయాలన్నా మొదట అడిగేది ఆధార్ కార్డు ఉందా అనే మాటే వస్తుంది. అయితే ఏ చిన్న మిస్టేక్ ఉన్నా అంతే సంగతులు. ఆ మిస్టేక్స్ సరిదిద్దుకోవాలంటే కనీసం 10 నుంచి 15 రోజుల పాటు ఎమ్మార్వో ఆఫీస్.. మీ సేవ అంటూ కాళ్లరిగేలా తిరగాల్సిందే. ఇవన్నీ వద్దనుకుంటే ఆదార్ సెంటర్‌కు అయినా వెళ్లాలి. అయితే ఇలా ఒకట్రెండు సార్లు కాదు ఎన్నిసార్లయినా తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇదివరకు ఉండేది. అయితే ఇకపై మునపటి మాదిరిగా ఎన్నిసార్లు పడితే.. అన్నిసార్లు ఆధార్‌ను ఇప్పుడు అప్డేట్ చేసుకోవడానికి వీల్లేదు. ఇందుకుగాను తాజాగా ఉడాయ్ ప్రకటించిన కొత్త నిబంధనల పాటించాల్సిందే మరి.

ఇవీ నిబంధనలు..

  • తాజా నిబంధనల ప్రకారం తప్పులుంటే రెండుసార్లు మాత్రమే మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది.
  • పుట్టినతేదీ, లింగం విషయంలో కేవలం ఒక్కసారి మాత్రమే మార్చుకునేందుకు ఛాన్స్ ఉంటుంది.
  • ఆధార్ కార్డులో చాలా వరకు పుట్టిన తేదీల్లో తప్పులుంటాయ్.. అసలు కార్డుపై వచ్చిన పుట్టిన తేదీకి.. ఒరిజినల్ పుట్టిన తేదీకి అసలు సంబంధాలే ఉండవ్. అయితే ఇకపై ఎలా పడితే అలా ఇష్టానుసారం మార్చుకోవడానికి లేదు.. మూడేళ్లు ఎక్కువగానీ.. లేదా తక్కువగానీ మాత్రమే చాన్స్ ఉంటుంది. అది కూడా బర్త్ సర్టిఫికేట్ ఉంటేనే లేకుంటే కుదరదు. ఒకవేళ ఎక్కువసార్లు పుట్టిన తేదీల్లో మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే ఆదార్ సెంటర్‌కు వెళ్లాల్సిందే మరి.
  • మార్పులు చేర్పులకు సంబంధించిన ఆధారాలను పోస్టు ద్వారా, ఈ మెయిల్ ద్వారా అధికారులకు పంపాల్సి ఉంటుంది.

More News

మహా ‘పీఠం’ శివసేనదే.. ‘సీఎం’గా కూర్చునేదెవరో..!?

మహారాష్ట్ర సీఎం ‘పీఠం’పై చిక్కుముడులన్నీ వీడిపోయాయి. ఇప్పటి వరకూ బీజేపీ-శివసేన కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయని భావించినప్పటికీ.. చివరికి సీన్ రివర్స్ కావడంతో రాజకీయ పరిణామాలన్నీ మారిపోయాయి.

జగన్‌ వ్యాఖ్యలపై స్పందించకండి.. జనసేన నేతలకు పిలుపు!

‘సినిమా నటుడు పవన్ కల్యాణ్‌కు ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయో.. ఎంత మంది పిల్లలో మరి. నలుగురు ఐదుగురు పిల్లలున్న పవన్ కళ్యాణ్ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదవటం లేదా?.

విజయ్‌చందర్‌కు వైఎస్ జగన్ కీలక పదవి

టాలీవుడ్ సీనియర్ నటుడు, వైసీపీ నేత తెలిదేవర విజయ్ చందర్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కీలక పదవి కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్ టీవీ అండ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా విజయ్ చందర్‌ను

లతా మంగేష్కర్‌కి అస్వస్థత

ప్రముఖ బాలీవుడ్‌ గాయని లతా మంగేష్కర్‌(90) అనారోగ్యానికి గురయ్యారు.

'నమస్తే నేస్తమా' లో హాస్యంతో పాటు ఎమోషనల్‌ ఉండే క్యారెక్టర్ చేశా - బ్రహ్మానందం

కె.సి. బొకాడియా చలనచిత్ర రంగంలో పరిచయం అవసరంలేని పేరు.