close
Choose your channels

2020లోకి వచ్చేశాం.. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి!

Wednesday, January 1, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

2019కి గుడ్ బై చెప్పేశాం.. కొత్త ఏడాది 2020లోకి అడుగు పెట్టేశాం.. అయితే జనవరి 1 అనేది 2020 ప్రారంభానికి గుర్తు ఉండటమే కాదు.. నేటి నుంచి పలు అంశాలు మారబోతున్నాయి. ఆర్థిక ప్రపంచంలో కొత్త నిబంధనలు, కొత్త నిర్ణయాలను గుర్తు చేస్తోంది. డెబిట్ కార్డ్, పాన్ కార్డ్, ఏటిఎంల నుంచి నగదు ఉపసంహరించుకోవడానికి లేదా ఆన్‌లైన్ బదిలీలు చేయడానికి ప్రయత్నిస్తున్న వారిని కూడా ప్రభావితం చేస్తాయి.

01. డెబిట్, ఏటీఎం కార్డులు :-
డెబిట్ కార్డ్ వినియోగదారులు హెచ్చరిక! అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు 2020 జనవరి 1 తర్వాత ఇఎంవి (యూరోపే, మాస్టర్ కార్డ్, వీసా) లేని డెబిట్ కార్డులను బ్లాక్ చేస్తున్నాయి. దీంతో ఇఎంవి కాని చిప్ డెబిట్ కార్డును ఉపయోగించే వినియోగదారులు ఏటీఎంల నుంచి డబ్బు విత్ డ్రా చేసుకునే సమయంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మార్గదర్శకాల ప్రకారం, అన్ని భారతీయ బ్యాంకులు తమ వినియోగదారుల మాగ్నెటిక్ డెబిట్ కార్డులను కొత్త ఇఎంవి కార్డుతో భర్తీ చేయాల్సి ఉంది. అంతర్జాతీయ చెల్లింపు ప్రమాణాలకు అనుగుణంగా మాగ్నెటిక్ డెబిట్ కార్డులను రీప్లేస్ చేయడం తప్పనిసరి. అందుకే ఆర్బీఐ.. మాగ్నెటిక్ డెబిట్ కార్డును ఉపయోగిస్తున్న ఎస్‌బిఐ, పిఎన్‌బి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్‌తో పాటుగా మిగిలిన బ్యాంకుల కస్టమర్లు తమ మాగ్నెటిక్ డెబిట్ కార్డును మార్చుకోవాలని సూచించింది. లేదంటే డబ్బును విత్ డ్రా చేసే సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

02. NEFT ఛార్జీలు మాఫీ..:-
బ్యాంకుల ఖాతాదారులకు ఆర్బీఐ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. ఇప్పటికే నెఫ్ట్ లావాదేవీలను 24 గంటల పాటు అందుబాటులోకి తీసుకొచ్చిన రిజర్వు బ్యాంకు నెఫ్ట్, ఆర్టీజీఎస్ లావాదేవీల ఛార్జీలను ఎత్తేసింది. సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ నుంచి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్-NEFT ఛార్జీలు వసూలు చేయొద్దని బ్యాంకుల్ని ఆర్‌బీఐ ఆదేశించింది. జనవరి 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రావాలని సూచించింది.

03. రూపే, యూపీఐ ఛార్జీలు :-
2020 నుండి స్వదేశీ రూపే, యూపీఐ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండిఆర్) ఛార్జీలు వర్తించవు. రూ. 50 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న అన్ని కంపెనీలు రూపే డెబిట్ కార్డ్, యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు సౌకర్యాన్ని అందించడానికి తప్పనిసరి చేయబడతాయి.

04. ఎస్‌బీఐ ఏటీఎం ఉపసంహరణలు :-
భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ వినియోగదారులు ఇక నుంచి ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేయాలంటే ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్)ని ఎంటర్ చేయాల్సి ఉంది. కాగా.. రూ. 10 వేలు, అంతకు పైబడి విత్ డ్రా చేస్తే మీ రిజిస్టర్ మొబైల్‌ నంబర్‌కు ఈ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తేనే నగదు విత్ డ్రా అవుతుంది లేకుంటే ఆ ట్రాన్సాక్షన్ రద్దు కాబడుతుంది. అయితే ఇది ఎస్‌బీఐ ఏటీఎం కార్డులున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ఎస్‌బీఐ కార్డులున్న వారు వేరే ఏటీఎంలలో విత్ డ్రా చేసినా.. వేరే బ్యాంకు ఖాతాదారులు ఎస్‌బీఐలో విత్ డ్రా చేసిన ఇది వర్తించదు.

05. ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫైలింగ్ :-
ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కేంద్రం కాస్త ఊరట నిచ్చింది. వాస్తవానికి ఇన్‌కమ్‌టాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్)కు ఆఖరి తేదీని జూలై 31నుంచి ఆగస్టు 5వరకు పొడిగించారు. అయితే.. పన్ను చెల్లింపుదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తేదీని పొడిగించడం జరిగింది. మీరు ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటిఆర్) దాఖలు చేయడానికి ఆగస్టు 31 గడువును కోల్పోయినట్లయితే, మీరు ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి చేయవచ్చు. ఏదేమైనా, జనవరి 1 నుండి దాఖలు చేసిన అన్ని ఆలస్యమైన ఐటిఆర్లకు, పదివేల రూపాయిలు జరిమానా విధించబడుతుంది.

06. పాన్ కార్డు :-
మీ పాన్ కార్డు ఇంకా ఆధార్‌తో అనుసంధానించబడకపోతే, ఆదాయపు పన్ను విభాగం డిసెంబర్ 31 గడువును మార్చి 31 వరకు పొడిగించినందున అది జనవరి 1 నుంచి పనిచేయదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.