'మహర్షి'లో మరికొన్ని కొత్త సీన్స్..!

  • IndiaGlitz, [Tuesday,May 14 2019]

సూపర్‌ స్టార్ మహేశ్ బాబు, పూజాహెగ్దే నటీనటులుగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం 'మహర్షి'. మే-09న థియేటర్లలోకి వచ్చిన 'మహర్షి'.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ.. కలెక్షన్ కింగ్‌లా మారి రికార్డులన్నీ బద్దలు కొడుతున్నాడు! ముందుగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చెప్పినట్లుగా సక్సెస్ మీట్ పెట్టి మరీ.. అభిమానులతోనే కాదు.. తాను కూడా కాలర్ ఎగరేశాడు మహేశ్.. దీంతో అసలు మహేశ్ ఏంటి..? ఏ సినిమాకూ ఇలా చేయలేదే..? అసలేముందబ్బా ఈ సినిమాలో అంతగా అంటూ ఆయన నాన్ ఫ్యాన్స్, సినీ ప్రియులు సైతం థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో మరింత కలెక్షన్లు పెరిగాయి. ఇప్పటికే వందకోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది కూడా.

ఇక అసలు విషయానికోస్తే.. ఈ సినిమాలో త్వరలో మరికొన్ని కొత్త సీన్స్ యాడ్ చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా రన్నింగ్ మొత్తం అంతా మూడు గంటలు కావడంతో కొన్ని కొన్ని సీన్లు చాలా బాగున్నప్పటికీ.. అభిమానులు మెచ్చుకుంటారని కాన్ఫిడెన్స్ ఉన్నప్పటీకీ తీసేయాల్సి వచ్చిందట. అందుకే లెన్త్ ఎక్కువైనా ఫర్లేదు కానీ కచ్చితంగా యాడ్ చేసేద్దామని చిత్ర యూనిట్ యోచిస్తోందట. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారట. 

అంతేకాదు.. ఈ సీన్స్ మహేశ్‌కు తెగనచ్చేశాయట. అందుకే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. మొత్తం రెండు సీన్స్‌ జోడిస్తున్నారట. దీంతో ఇప్పుడు 3:00 గంటలు కాస్త 3:10 కానుందట. కాస్త లెన్త్ ఎక్కువయినా ఫర్లేదు.. కానీ రెండవ వారంలో సీన్స్ జోడించాలనే చిత్రబృందం ఫిక్స్ అయిపోయిందట. సో.. ఇప్పటికే చాలా లెన్తీగా సినిమా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. అయితే ఈ సీన్స్‌ సినిమాకు ప్లస్ అవుతాయో.. మైనస్ అవుతాయో..? అసలు ఈ సీన్లు జోడించే వ్యవహారం ఎంత వరకు నిజమో..? అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే మరి.

More News

ఒక్కొక్కరు ముగ్గుర్ని పెళ్లి చేస్కోండి.. లేకుంటే జైలుకే..!

టైటిల్ చూడగానే ఇదేంటి.. ఒక్కొక్కరు ముగ్గుర్ని పెళ్లి చేసుకోవాలా..? అని ఆశ్చర్యపోతున్నారా..?

వార్నింగ్: వాట్సప్ యూజర్స్ వెంటనే అప్‌‌డేట్ చేయండి

ప్రముఖ మెసేజింగ్ యాప్.. వాట్సప్ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. వెంటనే మీ వాట్సప్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలంటూ కంపెనీ యూజర్స్‌ అందర్నీ అప్రమత్తం చేస్తోంది.

రామ్ పుట్టినరోజున 'ఇస్మార్ట్ శంక‌ర్‌' టీజ‌ర్ విడుద‌ల‌

ఎన‌ర్జ‌టిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న  చిత్రం 'ఇస్మార్ట్ శంక‌ర్‌'. 'డ‌బుల్ దిమాక్ హైద‌రాబాదీ' ట్యాగ్ టైన్‌.

టాలీవుడ్ డ్రగ్స్‌ కేసు కథ ముగిసింది.. సెలిబ్రిటీలందరికీ క్లీన్ చిట్!

టాలీవుడ్‌ని ఒక్క కుదుపు కుదిపిన డ్రగ్ కేసు వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

ఏబీసీడీ సినిమా మంచి హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను - నాని

యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ హీరోగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ పతాకాలపై రూపొందుతోన్న ఎంటర్‌టైనర్‌ 'ఏబీసీడీ'.