శ్యామ్.కె.నాయుడు కేసులో న్యూ ట్విస్ట్.. అదనంగా మరో కేసు..

  • IndiaGlitz, [Tuesday,June 30 2020]

సినిమాటోగ్రాఫర్ ఛోటా.కె.నాయుడు తమ్ముడు.. శ్యామ్.కె.నాయుడు కేసులో న్యూ ట్విస్ట్ వెలుగు చూసింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు రద్దు చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడంటూ సినీ ఆర్టిస్ట్ సాయి సుధ శ్యామ్ కె నాయుడిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కసులో శ్యామ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. కాగా ఆయన బాధితురాలితో కాంప్రమైజ్ అయినట్టు బాధితురాలి సంతకంతో పిటిషన్ వేసి బెయిల్ పొంది రెండు రోజుల్లోనే బయటకు వచ్చారు.

విషయం తెలుసుకున్న బాధితురాలు తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని.. తాను కంప్రమైజ్ అవడం అనేది కల్పితమని శ్యామ్ బెయిల్ పిటిషన్‌ను సవాల్ చేస్తూ మరోసారి కోర్టును ఆశ్రయించింది. తాను ఒప్పుకోలేదని తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని సాయ సుధ కోర్టుకు వెల్లడించింది. దీనిపై విచారణ నిర్వహించిన కోర్టు శ్యామ్ బెయిల్ పిటిషన్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆల్రెడీ ఉన్న కేసుతో పాటు శ్యామ్ కె నాయుడిపై ఫోర్జరీ కేసు కూడా నమోదైంది.

More News

‘సూర్యవంశీ’, ‘83’ చిత్రాల రిలీజ్ డేట్స్‌ను అనౌన్స్ చేసిన రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సీఇఓ షిభాషిస్ స‌ర్కార్‌

రెండు భారీ చిత్రాలు ‘సూర్యవంశీ’, ‘83’ కోసం సినీ ప్రేక్ష‌కులు, అభిమానులు ఎంతో ఆతృత‌గా, ఆస‌క్తిగా ఎదురు చూశారు.

‘ఆహా’లో విడుదల కానున్న ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ -- డి.సురేష్‌బాబు

సిద్ధు జొన్నల‌గ‌డ్డ‌, శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, షాలిని, శీర‌త్ క‌పూర్ హీరో హీరోయిన్లుగా ర‌వికాంత్ పేరెపు ద‌ర్శ‌క‌త్వంలో

నేను రాను బిడ్డో.. యములున్నా దవాఖానకు!

‘దగ్గుతోటి.. దమ్ముతోటి.. చలి జ్వరమొచ్చిన అత్తో.. అత్తో పోదాం రావే.. సర్కారు దవాఖానకు..

టిప్ టాప్‌గా ‘టిక్ టాక్‌’ను బ్యాన్ చేశారు!

చైనీస్ యాప్ ‘టిక్‌ టాక్‌’ను అక్కడి వారు ఎంతవరకూ ఉపయోగిస్తున్నారో తెలియదు కానీ..

గుడ్ న్యూస్ చెప్పిన భారత్ బయోటెక్.. తెలంగాణ నుంచే తొలి వ్యాక్సిన్!

కరోనా నిరోధానికి తొలి అడుగు తెలంగాణ నుంచే పడబోతోందా? అంటే అవుననే అంటోంది ‘భారత్ బయోటెక్’.