'నమకం..చమకం..' స్థానంలో కొత్త పదాలు చేరిక

  • IndiaGlitz, [Tuesday,June 20 2017]

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ ఎస్‌.హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మాత‌లుగా రూపొందిన క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ 'డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్'. ఈ సినిమా జూన్ 23న విడుద‌లవుతుంది. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. అల్రెడి విడుద‌లైన పాట‌ల‌కు చాలా హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

ఈ పాట‌ల్లో 'అస్మైక యోగ త‌స్మైక భోగ‌..' అనే పాట‌లో 'న‌మ‌కం..చ‌మ‌కం..' అనే ప‌దాలు అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయ‌ని, ఓ వ‌ర్గాన్ని కించ‌ప‌రిచేలా ఉన్నాయ‌ని వివాదం చెల‌రేగిన సంగ‌తి విదితమే. ఈ వివాదం స్పందించిన చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు తగు చ‌ర్య‌లు తీసుకున్నారు. సెన్సార్ స‌మ‌యంలోనే న‌మ‌కం..చ‌మ‌కం అనే ప‌దాల‌ను మార్చి వాటి స్థానంలో నా గ‌మ‌కం..నీ సుముఖం అనే ప‌దాల‌ను పొందుప‌రిచి సెన్సార్ స‌భ్యుల నుండి అమోదం పొందారు. సినిమాలో, ఇక‌పై రానున్న ఆల్బ‌మ్స్ అన్నింటిలో కొత్త ప‌దాల‌తో కూడిన పాట విన‌ప‌డుతుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలియ‌జేశారు.

More News

సంక్రాంతి బరిలోకి బాలయ్య...

నందమూరి బాలకృష్ణ చాలా వేగంగా సినిమాలను పూర్తి చేసేస్తున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 101వ సినిమా చేస్తున్న బాలయ్య వచ్చే నెలలో 102వ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

గోపీచంద్ కెరీర్ లో భారీ మొత్తానికి శాటిలైట్...

టాలీవుడ్ హంక్ గోపీచంద్ ఇప్పుడు సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న సినిమా `గౌతమ్ నంద`. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

నా కాన్ సన్ ట్రేషన్ అంతా తెలుగులోనే - రియా చక్రవర్తి

చాలామంది హీరోయిన్స్ టాలీవుడ్ లో టాలెంట్ నిరూపించుకొని బాలీవుడ్ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. కానీ… రియా చక్రవర్తి మాత్రం బాలీవుడ్ లో ప్రూవ్ చేసుకొని తెలుగు చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతోంది.

ఇంట్రస్టింగ్ టైటిల్ తో శిరీష్..

శ్రీరస్తు శుభమస్తు సినిమాతో హీరోగా మంచి విజయాన్నే అందుకున్నాడు హీరో అల్లు శిరీష్. ఇప్పుడు హర్రర్ థ్రిల్లర్ `ఎక్కడికి పోతావు చిన్నవాడా` దర్శకుడు విఐ.ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. సైంటిఫిక్ థ్రిల్లర్గా సినిమా రూపొందుతోంది.

ప్రేక్షకులు అనుకుంటున్నట్లు కాదంటున్న దర్శకుడు...

గోపీచంద్తో దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న చిత్రం గౌతమ్నంద. ఇందులో గోపీచంద్ హీరోగా, విలన్గా నటిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ దర్శకుడు సంపత్ నంది మాత్రం అలాంటిదేం లేదని తేల్చేశాడు.