పునీత్ మరణం: పెళ్లిమండపంలోనే అప్పుకు నివాళి అర్పించిన కొత్తజంట

  • IndiaGlitz, [Monday,November 01 2021]

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణంతో యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఆయననే దైవంగా భావించే అభిమానుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా కొత్తగా పెళ్లిన నవదంపతులు పెళ్లి మండపంలోనే పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌కు శ్రద్ధాంజలి ఘటించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మైసూరు సిద్ధార్థ నగరలోని కనక భవనంలో ఆదివారం మను కిరణ్, లావణ్య అనే నూతన జంట వివాహం జరిగింది.

పెళ్లితంతు ముగిసిన వెంటనే అకాల మరణం చెందిన సినీనటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలు వేసి నివాళి అర్పించారు. అతిథులు సైతం కొత్త జంటని ఆశీర్వదించడంతో పాటు పునీత్‌కు శ్రద్దాంజలి ఘటించారు. అందరిలోనూ పెళ్లి సంతోషం కంటే పునీత్‌ దూరమయ్యాడన్న బాధే ఎక్కువగా వ్యక్తమైంది. మరోవైపు పునీత్‌ మరణాన్ని తట్టుకోలేక ఒక అభిమాని కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం సాయంత్రం మైసూరు జిల్లాలోని కేఆర్‌ నగర పట్టణంలో ఈ దారుణం చోటు చేసుకుంది.

కాగా.. గుండెపోటుతో మరణించిన పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ఆదివారం ఉదయం బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో ముగిశాయి. తన తల్లిదండ్రుల సమాధి చెంతనే పునీత్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన అన్న రాఘవేంద్ర కుమారుడు వినయ్‌ రాజ్‌కుమార్‌ బాబాయ్ అంత్యక్రియలు నిర్వహించారు. పునీత్‌కు మగపిల్లలు లేకపోవడంతో రాఘవేంద్ర చేతుల మీదుగా అంత్యక్రియలు జరిపించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. వినయ్‌ హీరోగా నిలదొక్కుకోవడానికి పునీత్‌ ఎంతో సహాయపడ్డారు. ఆ రకంగా బాబాయ్ రుణం తీర్చుకున్నారు వినయ్. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సహా అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు పునీత్‌ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

More News

విశాల హృదయం: ఆ 1800 మంది పిల్లల బాధ్యత నాదే.. పునీత్‌కి విశాల్ ఘన నివాళి

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం యావత్ భారతీయ సినీ ప్రపంచాన్ని శోక సంద్రంలో ముంచింది.

అంచనాలు పెంచేసిన ‘‘ఆర్ఆర్ఆర్’’ గ్లింప్స్... ఫ్యాన్స్‌కి పూనకాలే..!!

బాహుబలి సిరీస్ తర్వాత ఎస్ఎస్ రాజమౌళీ తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ జనవరి 7న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

టీడీపీ పగ్గాలు చంద్రబాబుకు ఎందుకిచ్చావ్ - బాలయ్యకు మోహన్ బాబు సూటి ప్రశ్న

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఎంట్రీ  ఇచ్చిన సంగతి తెలిసిందే.

బిగ్‌బాస్ 5 తెలుగు: సన్నీకి నాగ్  వార్నింగ్.. హౌస్‌లో నాగినిగా కాజల్, మిగతా పాములు ఎవరంటే..?

బిగ్‌బాస్ 5 తెలుగుకు సంబంధించి చూస్తుండగానే వీకెండ్ వచ్చింది. ఎప్పటిలాగానే నాగార్జున గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి పంచాయతీ పెట్టి కంటెస్టెంట్స్ చేసిన టాస్క్‌ల్లో తప్పులను ఎత్తిచూపారు.

హీరో నాని చేతుల మీదుగా విడుదలకానున్న 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' టీజర్

మెగా డాట‌ర్ నిహారిక డిజ‌టిల్ మీడియాలో సందడి చేస్తున్నారు. సినిమాలు పెద్ద‌గా ఆమెకు కలిసిరాకపోయినా వెబ్ సిరీస్‌ల‌తో మాత్రం ప్రేక్షకులకు చేరువ అవుతున్నారు.