అస‌లు త‌గ్గ‌నంటోన్న నిధి అగ‌ర్వాల్‌

  • IndiaGlitz, [Monday,March 30 2020]

గ్లామ‌ర్ డాల్ నిధి అగ‌ర్వాల్‌కు తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు లేవు. ఇక త‌మిళంలో గ‌త ఏడాది ఓ సినిమాలో మాత్రం న‌టించింది. అయినా కూడా రెమ్యున‌రేష‌న్ విష‌యంలో అస‌లు త‌గ్గ‌నంటోంద‌ట ఈ బ్యూటీ. అస‌లు విష‌యమేమంటే ఈ అమ్మ‌డుని బెల్లంకొండ శ్రీనివాస్ అదుర్స్ అల్లుడు సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌మ‌ని కోరార‌ట‌. అందుకు ఆ అమ్మ‌డు చెప్పిన రెమ్యున‌రేష‌న్ విని నిర్మాత‌ల క‌ళ్లు తిరిగాయ‌ట‌. ఇంత‌కు నిధి అగ‌ర్వాల్ ఎంత మొత్తాన్ని కోట్ చేసిందో తెలుసా.. అర‌వై ల‌క్ష‌లు. ఇంత మొత్తం ఆ అమ్మ‌డు పూర్తి సినిమాకే ఇవ్వ‌డం లేదుగా! మ‌రి స్పెష‌ల్ సాంగ్‌కు అంతివ్వాలా! అంటే.. త‌ప్ప‌ద‌న్న‌ట్లు నిధి ఖ‌రాకండీగా చెప్పేసింద‌ని టాక్‌.

దీంతో నిర్మాత‌లు మ‌రో హీరోయిన్‌ను వెతుక్కునే ప‌నిలో ప‌డ్డారు. సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతోన్న చిత్రం అల్లుడు అదుర్స్‌. ఈ సినిమాలో న‌భా న‌టేష్ హీరోయిన్‌. ఈ వేస‌విలో సినిమాను విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే క‌రోనా ఎఫెక్ట్‌తో సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది. మ‌రిప్పుడు సినిమా విడుద‌ల వాయిదా ప‌డిన‌ట్టేన‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

'మోస‌గాళ్ళు' క‌థ ఇదేనా?

మంచు విష్ణు హీరోగా నటిస్తూ 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిర్మిత‌మ‌వుతోన్న చిత్రం ‘మోస‌గాళ్ళు’. తెలుగుతో పాటు ఇంగ్లీష్‌లోనూ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు

'వ‌కీల్‌సాబ్‌' వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత చేస్తోన్న తొలి చిత్రం ‘వ‌కీల్‌సాబ్‌’. బాలీవుడ్ మూవీ పింక్‌కు ఇది రీమేక్‌. దిల్‌రాజు

పెళ్లి వాయిదా...పుట్టిన‌రోజు వేడుక‌లు వ‌ద్దు: నితిన్‌

యువ క‌థానాయ‌కుడు నితిన్ త‌న పెళ్లిని వాయిదా వేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అలాగే ఈ నెల 30న కూడా పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను అభిమానులెవ‌రూ నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని కోరుతూ ఓ లేఖ రాశారు.

క‌రోనా నివార‌ణకు అత్యవ‌ర‌స‌మైన ప్రొట‌క్ష‌న్ కిట్స్ అందించిన నిఖిల్ సిద్ధార్థ‌

క‌రోనా మ‌హ‌మ్మారి రోజు రోజుకి విజృభిస్తుంది. ఈ భ‌యంక‌ర‌మైన వ్యాధి నివార‌ణ‌కు ప్ర‌భుత్వం వివిధ ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

సినీ కార్మికుల కోసం ముందుకొచ్చిన తారాలోకం

క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) ప్ర‌భావంతో దేశ‌మంత‌టా స్తంభించి పోయింది. ప‌లు రంగాలు ఆగిపోయాయి. అందులో ప‌నిచేసే ప‌లువురు కార్మికుల ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారింది.