close
Choose your channels

అటు పవర్ స్టార్.. ఇటు సూపర్ స్టార్‌తో నిధి..

Monday, May 3, 2021 • తెలుగు Comments

అటు పవర్ స్టార్.. ఇటు సూపర్ స్టార్‌తో నిధి..

ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ స్టార్ హీరోల సరసన చోటు దక్కించుకుంటోంది. ఇప్పటికే గల్లా అశోక్ డెబ్యూ మూవీతో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో హీరోయిన్‌గా అవకాశాలను చేజిక్కించుకుంది. అటు తమిళ్‌లో చేసిన రెండు సినిమాలకే ఈ అమ్మడికి కోలీవుడ్ అభిమానులు గుడి కట్టించేశారు. ఇక బాలీవుడ్‌లోనూ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కడుతున్నారు. ఈ తరుణంలోనే టాలీవుడ్‌కి చెందిన మరో స్టార్ హీరో సినిమాలో అవకాశం కొట్టేసిందని ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read: కరోనా రోగుల కోసం మెగాస్టార్ కీలక నిర్ణయం

సూపర్ స్టార్ మహేశ్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఈ మధ్య కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో ‘ఖలేజా’, ‘అతడు’ సినిమాలొచ్చాయి. ఖలేజా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినా.. అతడు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో మూడో సినిమాకు రంగం సిద్ధమైంది. ఈ కాంబినేషన్‌ను ప్రకటించిన నాటి నుంచే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాలోనే నిధి అగర్వాల్ హీరోయిన్‌గా  అందాల నిధికి అవకాశం దక్కినట్లు సమాచారం. ఇదే నిజమైతే అటు పవర్ స్టార్.. ఇటు సూపర్ స్టార్‌తో నటించబోతున్న నిధి.. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే కచ్చితంగా స్టార్ హీరోయిన్‌గా మారిపోతుందనడంలో సందేహం లేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz