మెగా హీరోతో నిధి

  • IndiaGlitz, [Monday,November 05 2018]

మెగా క్యాంప్‌కి చెందిన హీరోల్లో మ‌రో హీరో యాడ్ కాబోతున్నాడు. హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ సోదరుడు వైష్ణ‌వ్ తేజ్. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొండ‌నున్న ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించనున్నారు. బుచ్చిబాబు సానా ఇంతకు ముందు సుకుమార్‌ దగ్గర దర్శకత్వశాఖలో పనిచేశారు.

ఇటీవల 'రంగస్థలం' చిత్రానికి రైట‌ర్‌గా కూడా పనిచేశారు. ఈ నూత‌న చిత్రానికి ప‌నిచేసే ఆర్టిస్టులు, టెక్నీషియన్ల పేర్లను త్వరలోనే వెల్లడించనున్నారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని స‌మ‌కూర్చ‌నున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో హీరోయిన్‌గా నిధి అగ‌ర్వాల్ పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. 'స‌వ్య‌సాచి'లో హీరోయిన్‌గా న‌టించిన నిధి అగ‌ర్వాల్‌.. ఇప్పుడు అఖిల్‌తో 'మిస్ట‌ర్ మ‌జ్ను'లో న‌టిస్తుంది.