కన్నడ కుమారిగా నిధి

  • IndiaGlitz, [Sunday,January 07 2018]

రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన 'కుమారి 21 ఎఫ్' ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలోని పాటలు, మాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా యూత్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టింది. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఇప్పుడీ సినిమా కన్నడంలో అదే టైటిల్‌తో రీమేక్ అయ్యింది. తెలుగులో హెబ్బా చేసిన కుమారి పాత్రను కన్నడలో నిధి కుశలప్ప పోషించారు. రాజ్‌తరుణ్ పాత్రను ప్రణామ్ దేవరాజ్ చేశారు. అవినాష్, మనోజ్, అక్షయ్, రీతేష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతం అందించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది.

తెలుగులో హెబ్బాకి హీరోయిన్‌గా ఈ సినిమా మంచి పేరు తెచ్చింది. అలాగే తనకు కూడా 'కుమారి 21ఎఫ్' మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతోంది నిధి. హీరోయిన్‌గా తన రేంజ్ పెరుగుతుందని భావిస్తోంది.

More News

ఆ ప్రాజెక్ట్‌కి గుడ్‌బై చెప్పిందా?

ఈమధ్య బాలీవుడ్‌లో, టాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా ఎక్కుైవెందనే చెప్పాలి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. ఆమధ్య ఎయిర్ హోస్టెస్ నీర్జా బానోత్ జీవిత కథతో తెరకెక్కిన 'నీర్జా' సంచలన విజయం సాధించింది.

ఆ పాట‌లో సాయిధ‌ర‌మ్ తేజ్ స్టెప్స్ మెప్పిస్తాయా?

వి.వి.వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి నాయకానాయికలుగా నటిస్తున్న సినిమా 'ఇంటెలిజెంట్'. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి తమన్ స్వరాలను అందిస్తున్నారు.

చివ‌రి ద‌శ‌లో విక్ర‌మ్ క్రేజీ ప్రాజెక్ట్‌

వైవిధ్య‌భరితమైన కథాంశాలతో పోలీస్ చిత్రాలను తెరకెక్కించడంలో ద‌ర్శ‌కుడు గౌతమ్ మీనన్ సిద్ధ హస్తుడు. క‌థ ఏదైనా.. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి విల‌క్ష‌ణ న‌ట‌న‌తో మెప్పించడంలో చియాన్ విక్రమ్ పెట్టింది పేరు.

వ‌రుస సినిమాల‌తో సూర్య‌

తమిళ స్టార్ నటుడు సూర్య నటించిన తాజా త‌మిళ చిత్రం 'తాన సేరంద కూటం'. ఈ చిత్రాన్ని 'గ్యాంగ్' పేరుతో తెలుగులో అనువదించారు. ఈ రెండు వెర్ష‌న్‌లు సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న‌ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

36వ ఎంట్రీగా 'హ‌లో'

అక్కినేని అఖిల్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరోహీరోయిన్లుగా మ‌నం, 24 చిత్రాల ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం హ‌లో. అక్కినేని నాగార్జున ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ సినిమా డిసెంబ‌ర్ 22న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.