నిహారిక పెళ్లి.. ప్ర‌క‌ట‌న రేపే?

  • IndiaGlitz, [Thursday,June 18 2020]

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌నయ నిహారిక కొణిదెల త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనుంద‌ని వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ముద్దపప్పు అవకాయ్ వెబ్ సిరీస్‌తో మంచి పేరు సంపాదించుకున్న నిహారిక ‘ఒక మ‌న‌సు’ సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైంది. ఈమె చేసిన ‘సూర్య‌కాంతం’, అంత‌కు ముందే విజ‌య్ సేతుప‌తి, గౌత‌మ్ కార్తీక్‌ల‌తో ఓ త‌మిళ సినిమాలో న‌టించింది నిహారిక‌. అయితే హీరోయిన్‌గా ఈ అమ్మ‌డుకి స‌క్సెస్ ద‌క్కలేదు. ‘సైరా న‌ర‌సింహారెడ్డి’లో ఓ చిన్న పాత్ర‌లో క‌నిపించింది. ఓ త‌మిళ చిత్రంలో న‌టించ‌బోతుందంటూ వార్త‌లు విన‌పిస్తున్నాయి.

అయితే రీసెంట్‌గా కొన్ని ఇంట‌ర్వ్యూస్‌లో నిహారిక పెళ్లిని రెండు, మూడేళ్ల‌లో చేస్తామ‌ని నాగబాబు తెలిపారు. అన్న‌ట్లుగానే నాగ‌బాబు ఇప్పుడు నిహారిక పెళ్లిని గుంటూరు అబ్బాయితో ఖ‌రారు చేశార‌ని, ముహూర్తాలు కూడా పెట్టేశార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అంతా కుదిరితే వ‌చ్చే ఏడాది నిహారిక పెళ్లి జ‌రుగుతుంద‌ని కూడా స‌మాచారం. రేపే నిహారిక పెళ్లికి సంబంధించిన వార్త అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్నార‌ని కూడా వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై నాగ‌బాబు ఇత‌రులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More News

కరోనా నేపథ్యంలో 'పలాస' హీరో రక్షిత్ కొత్త సినిమా

"పలాస 1978" తో హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్నాడు.

‘పుష్ప’ విష‌యంలో నిర్మాత‌లు క్లారిటీ!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’.

స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ అవార్డుకు ఎంపికైన పలాష్ తనేజా

ఆపిల్ ప్రపంచ వ్యాప్త డెవలపర్ కాన్ఫరెన్స్ (డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2020 స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ అవార్డుకు 19 ఏళ్ల పలాష్ తనేజా ఎంపికయ్యాడు.

నా కూతురి ఆత్మహత్య కేసులో సల్మాన్ ప్రమేయం ఉంది: జియాఖాన్ తల్లి

బాలీవుడ్ ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యోదంతం పలు వివాదాలకు కారణమవుతోంది.

ఏపీలో 400 మార్క్‌ను దాటేసిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మొన్నటి వరకూ 200 మార్క్ దాటని కరోనా కేసులు..