యంగ్ హీరో నిఖిల్ చేతుల మీదుగా 'తొలి పరిచయం' ట్రైలర్ లాంచ్

  • IndiaGlitz, [Thursday,February 16 2017]

పియుకె ప్రొడక్షన్స్‌ పతాకంపై దీపక్‌కృష్ణ నిర్మిస్తున్న చిత్రం తొలి పరిచయం'. ఎల్‌. రాధాకృష్ణ దర్శకుడు. వెంకీ, లాస్య హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. మురళీమోహన్‌, సుమన్‌, రాజీవ్‌ కనకాల, రఘుబాబు, ఛత్రపతి శేఖర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యంగ్‌ హీరో నిఖిల్‌ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పోస్టర్స్‌, ట్రైలర్స్‌ క్యూరియాసిటీ కలిగించే విధంగా ఉన్నాయి. ఈ సినిమా ద్వారా యంగ్‌ ప్రొడ్యూసర్, డైరెక్టర్‌ పరిచయం అవుతున్నారు. ఇటీవల కాలం లో సినిమాలో కొంచెం బాగున్నా ఆడేస్తున్నాయి. మంచి వసూళ్లు రాబడుతున్నాయి. నా ఫ్రెండ్‌ కళహరి రెడ్డి ఈ సినిమాలో ఓ పార్ట్‌ అయ్యాడు. తనతో పాటు టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌' అన్నారు.
ఛత్రపతి శేఖర్‌ మాట్లాడుతూ... ఈ సినిమాలో తాగుబోతు పాత్రలో నటించాను. నా మీద ఒక పాట కూడా ఉంటుంది. నిర్మాతలు రాజీపడకుండా బ్యూటిఫుల్‌ లొకేషన్స్‌లో చిత్రీకరించారు. డైరెక్టర్‌కి తొలి సినిమా అయినా అందరికీ నచ్చేవిధంగా తెరకెక్కిస్తున్నారు' అన్నారు.
హీరో వెంకీ మాట్లాడుతూ.. ప్రజంట్‌ జనరేషన్‌ ఆలోచనకు అద్దం పట్టేలా ఈ చిత్రం ఉంటుంది. పాపికొండల్లాంటి అందమైన లొకేషన్స్‌లో షూటింగ్‌ జరిగింది' అన్నారు.
హీరోయిన్‌ లాస్య మాట్లాడుతూ.. హీరోయిన్‌గా అవకాశం కల్పించిన దర్శక నిర్మాతకు ధన్యవాదాులు' అన్నారు.
సంగీత దర్శకుడు ఇంద్రగంటి మాట్లాడుతూ... రొటీన్‌కు భిన్నంగా ఉండే చిత్రమిది. సంగీతానికి ప్రాధాన్యత ఉన్న చిత్రం కావడంతో మంచి పాటలొచ్చాయి. త్వరలో ఆడియో రిలీజ్‌ వేడుక ఉంటుంది' అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత దీపక్‌కృష్ణ, కళహరి రెడ్డి తో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.
మురళీమోహన్‌, సుమన్‌, రాజీవ్‌ కనకాల, రఘుబాబు, ఛత్రపతి శేఖర్‌, వైవా హర్ష, కళ్లు కృష్ణారావు, ప్రీతినిగమ్‌, రాగిణి, మధుమణి, సాహితి, దీప్తి, మాధవి, రామిరెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫి: శరవణ కుమార్‌ సి., ఎడిటర్‌: కృష్ణపుత్ర, మ్యూజిక్‌: ఇంద్రగంటి, డాన్స్‌: కృష్ణారెడ్డి, లిరిక్స్‌: చంద్రబోస్‌, కాసర్ల శ్యాం, కరుణాకర్‌, కో ప్రొడ్యూసర్‌: సురేష్‌కుమార్‌, ధర్మేంద్ర, నిర్మాత: దీపక్‌కృష్ణ, దర్శకత్వం: ఎల్‌.రాధాకృష్ణ.

More News

మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించిన హీరో శ్రీకాంత్ చిత్రం 'రారా' తొలి ప్రచారచిత్రం

అన్నయ్య మెగాస్టార్ 'చిరంజీవి' తమ్ముడు హీరో 'శ్రీకాంత్' వీరిద్దరి అనుబంధం చిత్రపరిశ్రమలో ప్రత్యేకమైనది.. ఆ అనుబంధమే మరోసారి శ్రీకాంత్ నూతన చిత్రానికి వేదిక అయింది.

ఓవర్ సీస్ లో 'కాటమరాయుడు' తఢాఖా

పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై కిషోర్ పార్థసాని(డాలీ) దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న చిత్రం `కాటమరాయుడు`.

మిలియన్ డాలర్స్ క్లబ్ లోకి నాని

నేచురల్ స్టార్ నాని హీరోగా దిల్రాజు నిర్మాతగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన క్యారెక్టర్ బేస్డ్ లవ్స్టోరీ `నేను లోకల్`. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్తో భారీ ఓపెనింగ్స్ను సాధించింది.

నాగార్జున రోల్ ఏంటంటే

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇప్పుడు ఓంకార్ దర్శకత్వంలో సక్సెస్ఫుల్ మూవీ రాజుగారి గది సీక్వెల్ రాజుగారి గది2లో నటించడానికి రెడీ అయ్యాడు. పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, ఓక్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగ్ రోల్ చాలా డిఫరెంట్గా ఉంటుందట.

కార్తీ స్పెషల్ ట్రయినింగ్...

తెలుగు, తమిళంలో మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో ఒకడైన కార్తీ ఇప్పుడు మణిరత్నం సినిమా చెలియాకు సంబంధించిన చిత్రీకరణనంతా పూర్తి చేసుకున్నాడు.