నిఖిల్ చేతుల మీదుగా ఆదిపినిశెట్టి 'మరకతమణి' టీజర్ విడుదల

  • IndiaGlitz, [Monday,May 22 2017]

'స‌రైనోడు' లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంలో వైరం ధ‌నుష్ పాత్ర‌లో అంద‌రిని మెప్పించిన ఆది పినిశెట్టి హీరోగా , నిక్కిగ‌ర్లాని హీరోయిన్ గా చేస్తున్న చిత్రం "మ‌ర‌క‌త‌మ‌ణి". ఇటీవ‌లే 'మ‌లుపు' లాంటి కాన్సెప్టెడ్ క‌మ‌ర్షియ‌ల్ హిట్ సాధించిన ఆదిపినిశెట్టి, నిక్కి గ‌ర్లాని మ‌రోక్క‌సారి జంట‌గా చేసిన‌ మ‌ర‌క‌త‌మ‌ణి టీజ‌ర్ ని ఇటీవ‌లే కేశ‌వ చిత్రం తో క‌లెక్ష‌న్ల రికార్డులు సునామి క్రియోట్ చేస్తున్న నిఖిల్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు. త‌మిళం లో రెండు సూప‌ర్‌ హిట్ చిత్రాల‌కి వ‌ర్క్ చేసిన A.R.K.శ‌ర్వ‌న‌ణ్ ద‌ర్శ‌కత్వం చేస్తున్నారు. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ఏక‌కాలంలో జూన్ లో విడుద‌ల‌కి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రిషి మీడియా, శ్రీ చ‌క్ర ఇన్నోవేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ.. మేము అడిగిన వెంట‌నే కాద‌న‌కుండా మా మ‌ర‌క‌త‌మ‌ణి టీజ‌ర్ ని విడుద‌ల చేసిన నిఖిల్ గారికి మా హ్రుద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. 'స‌రైనోడు' లాంటి సూప‌ర్‌బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం లో వైరం ధ‌నుష్ గా తిరుగులేని స్టైలిస్ పాత్ర‌లో అల‌రించిన ఆది పినిశెట్టి గారు హీరోగా నటించిన చిత్రం మ‌ర‌క‌త‌మ‌ణి. మ‌లుపు లాంటి సూప‌ర్ హిట్ చిత్రం త‌రువాత‌ ఆది పినిశెట్టి, నిక్కి గ‌ర్లాని లు జంట‌గా న‌టించారు. ఈ చిత్రం చాలా ఇంట్ర‌స్టింగ్ గా వుండ‌ట‌మే కాకుండా అడ్వంచ‌ర్ ఘెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ గా త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో తెర‌కెక్కుతుంది. ఈ చిత్రం జూన్ లొ విడుద‌ల కి స‌న్నాహ‌లు చేస్తున్నాము. ఈ చిత్రానికి క‌బాలి మ్యూజిక్ ద‌ర్శ‌కుడు సంతోష్ నారాయ‌ణ్ అసిస్టెంట్ దిబు థామ‌స్ తొలిసారిగా మ్యూజిక్ చేస్తున్నారు. అలాగే క‌బాలి సింగ‌ర్ అనిల్ కామ‌రాజ్ ఈ చిత్రంలో న‌టించ‌టం తో పాటు ఓ సూప‌ర్ సాంగ్ పాడారు. త‌మిళ‌, తెలుగు బాష‌ల్లో ఓకేసారి విడుద‌ల చేస్తున్నాము. కొటా శ్రీనివాస‌రావు గారు ఓ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తున్నారు. అలాగే సూప‌ర్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మ‌నందం గారు న‌వ్వులు కురిపించారు. ఈ చిత్రం అంద‌రిని స‌ర్‌ప్రైజ్ చేస్తుందన‌టంలో సందేహం లేదు." అన్నారు.
న‌టీన‌టులు.. ఆదిపినిశెట్టి, నిక్కిగ‌ర్లాని, కొటాశ్రీనివాస‌రావు, బ్ర‌హ్మ‌నందం, ఆనంద్ రాజ్‌, అరుణ్ రాజ్‌, కామ‌రాజ్‌, రామ్‌దాస్ త‌దిత‌రులు న‌టించారు.
సంగీతం- దిబు నైన‌న్ థామ‌స్‌, సినిమాటోగ్రాఫ‌ర్‌- పి.వి.శంక‌ర్‌, ఎడిట‌ర్‌- ప్ర‌స‌న్న.జి.కె, నిర్మాతలు- రిషి మీడియా, శ్రీ చ‌క్ర ఇన్నోవేష‌న్స్‌, క‌థ‌,స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వం- A.R.K.శ‌ర్వ‌న‌ణ్

More News

మెదటి మూడురోజులకి 11.40 కొట్లు వసూలు చేసిన 'కేశవ'

గత మూడేళ్లుగా నిఖిల్ నటించిన సినిమాలన్నీ వైవిద్యంగా వుంటున్నాయి. అంతేకాదు అన్ని చిత్రాలు కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వటమే కాకుండా నిఖిల్ చిత్రం అంటే వైవిధ్యం తో కూడిన చిత్రాల కేరాఫ్ అడ్రాస్ గా క్రేజ్ తెచ్చిపెట్టాయి.

నిర్మాతగా చెబుతున్నాను..నా హీరో సూపర్ - 'రా రండోయ్..వేడుక చూద్దాం' పాటల వేడులో కింగ్ నాగార్జున

యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ.శే.శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై కళ్యాణ్కృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించి చిత్రం 'రారండోయ్ ..వేడుక చూద్దాం' సినిమా పాటల విడుదల కార్యక్రమం పాటల వేడుక చూద్దాం ఆదివారం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్లో జరిగింది.

సంపూర్ణేష్ బాబు 'వైరస్' ఆడియో విడుదల

సంపూర్ణేష్ బాబు హీరోగా విదిశా రెడ్డి, దీక్ష హీరోయిన్ లుగా ఎస్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో పుల్లరేవు రామచంద్ర రెడ్డి సమర్పణలో ఏ ఎస్ ఎన్ ఫిలిమ్స్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ క్రియేషన్స్ పతాకంపై సలీమ్, శ్రీనివాస్ వంగలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "వైరస్".

శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ప్రారంభం

నందమూరి బాలకృష్ణకు "డిక్టేటర్" వంటి డీసెంట్ హిట్ ను అందించిన డైరెక్టర్ శ్రీవాస్ తన తదుపరి చిత్రాన్ని నేడు ప్రారంభించారు. "ఎక్కడికి పోతావు చిన్నవాడా" చిత్రంతో తొలి ప్రయత్నంలోనే ఘన విజయాన్ని సొంతం చేసుకొన్న నిర్మాణ సంస్థ మేఘన ఆర్ట్స్ శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 6వ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఢిల్లీ ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియమ్ లో 20 వేల ప్రేక్షకుల నడుమ ఘనంగా జరిగిన 'జట్టు ఇంజనీర్ ' ప్రియమిర్ షో

యం యస్ జి,యం యస్ జి 2,లయన్ హార్ట్,నాపాక్ కో జవాబ్,వంటి యాక్షన్ విత్ మెసేజ్ తో వచ్చిన నాలుగు చిత్రాల