నిఖిల్ మూవీ క్యాస్టింగ్ కాల్...

  • IndiaGlitz, [Saturday,July 15 2017]

'స్వామిరారా', 'కార్తికేయ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'కేశవ' వంటి వరుస విజయాలను సాధించిన యువ కథానాయకుడు నిఖిల్‌ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఓ చిత్రం రూపొందనుంది. శరణ్‌ కొప్పిశెట్టి అనే నూతన దర్శకుడు తెరకెక్కించనున్న చిత్రానికి, దర్శకుడు సుధీర్‌ వర్మ స్క్రీన్‌ప్లే సమకూరుస్తుండగా, మరో దర్శకుడు చందు మొండేటి డైలాగ్స్‌ అందిస్తున్నారు.
యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమా రూపొందనుంది. సినిమాల్లో నటించాలనుకునే యువతీయువకులకు నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ సినిమాలో అవకాశం కల్పిస్తుంది. అందులో భాగంగా ఆసక్తి ఉన్న యువతీ యువకులు ఫోటోతో పాటు తమ పూర్తి వివరాలను సెలబ్-జోన్. కామ్ లో అప్ డేట్ చేసుకోవాలని నిర్మాణ సంస్థ తెలియజేసింది.

More News

'బటర్ ఫ్లైస్' సినిమా ప్రారంభం

భీమవరం టాకీస్ బ్యానర్పై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా రూపొందనున్న కొత్త చిత్రం `బటర్ ఫ్లైస్`. కె.ఆర్.ఫణిరాజ్ దర్శకుడు. ఈ చిత్రం లో హర్షిని,రోజా భారతి,మేఘనరమి,జయ,ప్రవల్లిక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

హిస్టారికల్ విజువల్ వండర్ 'సువర్ణ సుందరి'

ఇటీవల హిస్టరీ బ్యాక్డ్రాప్లో సినిమాల వెల్లువ మొదలైంది. ప్రస్తుతం మన ఫిలింమేకర్స్ చరిత్ర నేపథ్యంలో సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

డ్రగ్స్ తీసుకున్న దోషులకు శిక్ష తప్పదు: తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షడు ప్రతాని రామకృష్ణ గౌడ్

ప్రస్తుతం టాలీవుడ్ లో డ్రగ్స్ హాట్ టాపిక్. ఏ నోట విన్నా... ఎవరిని కదిపినా టాలీవుడ్ డ్రగ్స్ మత్తులో జోగుతుందంటూ ఒక్కటే ముచ్చట. కొంత మంది సెలబ్రిటీలకు నోటీసులు కూడా వెళ్లినట్లు వార్తలొస్తున్నాయి.

'డ్రగ్స్' నేపథ్యంలో నయనతార 'వాసుకి'

'డ్రగ్స్ 'వ్యవహారంలో టాలీవుడ్ పరేషాన్ అవుతోంది.

రాఘవ లారెన్స్ చేతుల మీదుగా 'వాడొస్తాడు' మోషన్ పోస్టర్ విడుదల

2m సినిమాస్ బ్యానర్ పై కె.వి.శబరీష్ సమర్పిస్తూ,నిర్మిస్తున్న చిత్రం 'వాడొస్తాడు'.