నిఖిల్ మూవీ ఓవర్ సీస్ హక్కులను దక్కించుకున్న...

  • IndiaGlitz, [Saturday,February 04 2017]

విభిన్న చిత్రాలు చేసే హీరోగా నిఖిల్ కు గుర్తింపు ఉంది. రీసంట్‌గా ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా సినిమాతో మంచి స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్న నిఖిల్ తాజా చిత్రం 'కేశవ'ను అభిషేక్ పిక్చర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తుంది. 'స్వామి రారా' వంటి హిట్ తర్వాత సుధీర్ వర్మ - నిఖిల్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి. ఈ సినిమా ఓవ‌ర్ సీస్ హ‌క్కుల‌ను రెడ్ హార్ట్ మూవీస్ వారు ద‌క్కించుకున్నారు. పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగే సరికొత్త కథతో తెరకెక్కుతోన్న సినిమా ఇది.ఈ సినిమాకు స‌న్ని ఎం.ఆర్ సంగీతం అందిస్తున్నారు.

More News

'విన్నర్' రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది...

సాయిధరమ్ తేజ్ హీరోగా గ్రాండ్గా తెరకెక్కుతున్న చిత్రం `విన్నర్`. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోంది. బేబి భవ్య సమర్పిస్తున్నారు.

'దేవిశ్రీప్రసాద్' మోషన్ పోస్టర్ విడుదల చేసిన స్టార్ కమెడియన్ అలీ

ఆర్.ఒ.క్రియేషన్స్ బ్యానర్పై మనోజ్ నందన్, భూపాల్, పూజా రామచంద్రన్ ప్రధాన తారాగణంగా సశేషం, భూ వంటి చిత్రాల డైరెక్టర్ శ్రీ కిషోర్ దర్శకత్వంలో రూపొందుతోన్న థ్రిల్లర్ ఎంటర్టైనర్ `దేవిశ్రీప్రసాద్`.ఆర్.వి.రాజు, ఆక్రోష్ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.

అర్జున్- జెడి చక్రవర్తిల 'కాంట్రాక్ట్'

ప్రముఖ కథానాయకులు అర్జున్, జెడి చక్రవర్తి హీరోలుగా కృతి కట్వా, దివ్యాసింగ్ హీరోయిన్లుగా సమీర్ ప్రొడక్షన్స్ పతాకం పై సమీర్ దర్శకనిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం 'కాంట్రాక్ట్ '.

డా.రాజశేఖర్ 'పి.ఎస్.వి.గరుడ వేగ 126.18ఎం' ఫస్ట్ లుక్ రిలీజ్

అంకుశం, మగాడు, అగ్రహం వంటి తెలుగు చిత్రాల్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించి మెప్పించి యాంగ్రీ యంగ్ మేన్గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న కథానాయకుడు డా.రాజశేఖర్

విడుదల కి ముందే 100 కొట్ల క్లబ్ లో సూర్య నటించిన 'S3-యముడు-3'

వరుసగా పోలీస్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి స్టార్ క్రేజ్ను సంపాందించుకున్న సూర్య , శ్రుతిహసన్, అనుష్కలు జంటగా నటిస్తున్న చిత్రం "S3-యముడు-3".