నిఖిల్ కొత్త చిత్రం టైటిల్ అదేనా?

  • IndiaGlitz, [Thursday,March 08 2018]

కార్తికేయ', ఎక్కడికి పోతావు చిన్నవాడా', సూర్య వర్సెస్ సూర్య'.. ఇలా విభిన్నమైన కథలతో సినిమాలను చేసి విజయాలను సొంతం చేసుకున్నారు యువ కథానాయకుడు నిఖిల్. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న కిరాక్ పార్టీ' సినిమాలో నిఖిల్‌ స్టూడెంట్ లీడర్‌గా నటించారు. ఇది కన్నడ సినిమా కిరిక్ పార్టీ'కి రీమేక్. ఈ చిత్రం ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా వుంటే.. 2016లో తమిళంలో ఘన విజయం సాధించిన క‌ణిత‌న్' సినిమాని తెలుగులో పునఃనిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా హక్కుల్ని ఠాగూర్' మధు సొంతం చేసుకున్నారు. నిఖిల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ముద్ర' అనే టైటిల్‌ను కూడా రిజిస్టర్ చేయించార‌ని స‌మాచారం. తమిళ్ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన టి.ఎన్.సంతోష్.. తెలుగు వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. పూర్వ నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది. ఈ చిత్రానికి సంబంధించి క‌థానాయిక వివ‌రాల‌తో పాటు మరిన్ని విషయాలను నిర్మాత త్వరలోనే వెల్లడిస్తారు.

More News

మార్చి 16న దండుపాళ్యం 3 విడుదల

దండుపాళ్యం ఈ పేరు వింటేనే కన్నడ సీమ అదిరిపోతుంది. బెంగుళూరు సిటీకి ముచ్చెమటులు పట్టించిన ఓ నొటోరియస్ కిల్లర్ గ్యాంగ్ కి పోలిసులు ఇచ్చిన బిరుదే దండుపాళ్యం. ఆ గ్యాంగ్ కి సంబంధించిన ఊరు పేరే ఈ దండుపాళ్యం. కన్నడంలో దండుపాళ్య అని అంటారు.

నాగచైతన్య - సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం.2

షైన్ స్క్రీన్స్ తమ సంస్థ నుంచి రాబోయే రెండో చిత్రాన్ని ఎనౌన్స్ చేసింది.

ద్విభాషా చిత్రంలో నితిన్...

యూనివర్సల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ ఇప్పుడు రాజకీయాల్లో బిజీ కావడం వల్ల..

నితిన్ తో ఛలో అంటున్న దర్శకుడు...

ఈ ఏడాది 'ఛలో' సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల.

మార్చి 9న 'కోటికొక్కడు'

'ఈగ' ఫేమ్‌ సుదీప్‌ హీరోగా నిత్యమీనన్‌ హీరోయిన్‌గా కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో కన్నడ, తమిళ్‌ భాషల్లో రూపొందిన చిత్రం 'కోటిగొబ్బ-2'. ఈ చిత్రం ఇటీవల రిలీజై సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయి 120 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసింది.