కార్తీకేయ 2 కోసం సిక్స్ ప్యాక్ చేస్తున్న నిఖిల్ సిద్ధార్థ్

  • IndiaGlitz, [Saturday,April 04 2020]

యంగ్ డైన‌మిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, యంగ్ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేష‌న్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ కార్తీకేయ 2. వ‌రుస హిట్ సినిమాలు రూపొందిస్తున్న పిపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్లు పై విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ సీక్వెల్ కి సంబంధించిన టైటిల్ కాన్సెప్ట్ పోస్ట‌ర్ కి ఇప్ప‌టికే అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది.

ఇటీవ‌లే శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంకటేశ్వ‌రుని స‌న్నిధిలో ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుత ప‌రిణిమాల రీత్య కార్తీకేయ 2 బృందం వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నారు.

హీరో నిఖిల్ త‌న కెరీర్ లో తొలిసారిగా కార్తీకేయ 2 లో సిక్స్ ప్యాక్ బాడీతో క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే నిఖిల్ సిక్స్ ప్యాక్ షేప్ కోసం కావాల్సిన తీవ్ర క‌స‌ర‌త్తులు ప్రారంభించారు. దీనికి సంబంధించిన సెల్పీ ఫోటో త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశారు నిఖిల్. మ‌రో నాలుగు వారాల్లో ఫుల్ సిక్స్ ప్యాక్ లుక్ క‌నిపించ‌బోతున్న‌ట్లుగా నిఖిల్ ట్విట్ చేశారు.

ఇది ఇలా ఉంటే ఈ ప్రాజెక్ట్ ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించేందుకు ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు అధికారిక‌గా ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర బృందం తెలిపింది

More News

సాంగ్‌తో షురూ చేయ‌నున్న ఆలియా భ‌ట్‌

బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న

వ‌రుణ్‌తేజ్‌తో న‌టిస్తోన్న హీరోయిన్‌?

ఈ ఏడాది `ఎఫ్ 2`, `గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న యువ హీరో వ‌రుణ్ తేజ్‌. డిప‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించే వ‌రుణ్ తేజ్

కీర్తి పెళ్లి చేసుకోనుందా..?

మ‌ల‌యాళ చిత్రాల్లో నటించి ఆ త‌ర్వాత తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కీర్తిసురేశ్ త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల‌కు నేను శైల‌జ చిత్రంతో ప‌రిచ‌యమైంది. త‌ర్వాత తెలుగు,

లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో అనుప‌మ‌

మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌..అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్ సరికొత్త అడుగు వేయనుందా? అంటే అవున‌నే స‌మాధానం తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ నుండి విన‌ప‌డుతుంది.

కరోనాపై పోరాటానికి బాలయ్య భారీ విరాళం.. చిరు థ్యాంక్స్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధం ప్రకటించాయి. ఈ క్రమంలో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తమ వంతుగా ప్రభుత్వాలకు సాయం చేస్తున్నారు.