close
Choose your channels

కనువిందు చేసే ఒంపుసొంపులతో నిఖిల్ హీరోయిన్ బికినీ ఫోజు

Wednesday, July 7, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బెంగాలీ భామ త్రిధా చౌదరి గుర్తుండే ఉంటుంది. నిఖిల్ నటించిన హిట్ మూవీ 'సూర్య వర్సస్ సూర్య' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో త్రిధా చౌదరి తన నటనతో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ఆమెకు నటనకు స్కోప్ ఉన్న పాత్రే దక్కింది. దీనితో నటిగా తనని తాను నిరూపించుకుంది త్రిధా.

ఆ తర్వాత మనసుకు నచ్చింది, 7, అనుకున్నది ఒక్కటి అయినది ఒకటి లాంటి చిత్రాల్లో అందాలు ఆరబోసింది. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే త్రిధా చౌదరి తరచుగా గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. బికినిలో ఆమె గ్లామర్ మెరుపులు కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

తాజాగా త్రిధా చౌదరి మియామి బీచ్ వెకేషన్ లో ఉన్న బికినీ పిక్ పోస్ట్ చేసింది. ఈ ఫోజులో త్రిధా స్టైలిష్ గా , సెక్సీగా ఉంటూ తన అందాలతో కనువిందు చేస్తోంది. బీచ్ లో త్రిధా ఇసుకలో మోకాళ్లపై కూర్చుని గ్లామర్ ఒలకబోస్తోంది. ఆమె ధరించిన గాగుల్స్ త్రిధా హాట్ నెస్ కు స్టైల్ జోడించాయి.

త్రిధా తన హాట్ ఫోటో షూట్స్ తో గ్లామర్ రోల్స్ కు రెడీ అనే సంకేతాలు ఇస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న షంషీరాలో కీలక పాత్రలో నటిస్తోంది. టాలీవుడ్ లో సూర్య వర్సెస్ సూర్య తర్వాత అంతటి గుర్తింపు తెచ్చిపెట్టే రోల్ కోసం త్రిధా ఎదురుచూస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.