close
Choose your channels

నిఖిల్ పెళ్లి.. పెళ్లి ఎక్క‌డంటే..?

Wednesday, May 13, 2020 • తెలుగు Comments

నిఖిల్ పెళ్లి.. పెళ్లి ఎక్క‌డంటే..?

హీరో నిఖిల్ పెళ్లి మ‌రోసారి వాయిదా ప‌డిందంటూ వ‌చ్చిన వార్త‌లో నిజం లేదని సినీ వ‌ర్గాల స‌మాచారం. తాజా స‌మాచారం మేర‌కు రేపు(మే 14న‌) నిఖిల్ డాక్ట‌ర్ ప‌ల్ల‌వి వ‌ర్మ‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఏప్రిల్ 16న నిఖిల్ డాక్ల‌ర్ ప‌ల్ల‌వి వ‌ర్మ‌ను పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. అయితే క‌రోనా ప్ర‌భావంతో పెళ్లిళ్లు చేసుకోరాద‌ని ప్ర‌భుత్వం ఆర్డ‌ర్స్ పాస్ చేసింది. దీంతో నిఖిల్ పెళ్లి వాయిదా ప‌డింది. దీంతో వీరివురి కుటుంబ పెద్ద‌లు మే 14న పెళ్లి చేయాల‌నుకున్నారు. అయితే కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ను మే 17 వ‌ర‌కు పొడిగించింది. దీంతో మ‌రోసారి నిఖిల్‌, ప‌ల్ల‌వి వ‌ర్మ‌ల పెళ్లి వాయిదా వేసుకోవాల‌నుకున్నారు. అయితే ఇంట్లోని పెద్ద‌లు పెళ్లిని రేపే చేసేయాల‌ని నిశ్చ‌యించార‌ట‌.

ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు నిఖిల్ పెళ్లిని హైద‌రాబాద్ న‌గ‌ర శివారు ప్రాంత‌మైన శామీర్‌పేట‌లోని ఓ పామ్ హౌస్‌లో చేస్తున్నార‌ట‌. రెండు కుటుంబాల‌కు చెందిన బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు 15 మంది కంటే ఎక్కువ కాకుండా హాజ‌ర‌వుతున్నార‌ట‌. ఈ ముహూర్తాన్ని మిస్ చేస్తే మూడం వ‌చ్చేస్తుంద‌ని పెద్ద‌లు భావించ‌డం వ‌ల్ల‌నే నిఖిల్‌, ప‌ల్ల‌వి వ‌ర్మ‌ల పెళ్లి నిరాడంబ‌రంగానే చేసేస్తున్నారు. ఈరోజు రాత్రి(బుధ‌వారం)కి నిఖిల్‌ను పెళ్లి కొడుకుని చేస్తున్నార‌ట‌. రేపు ఉద‌యం పెళ్లి ఉంటుంద‌ని స‌మాచారం.

Get Breaking News Alerts From IndiaGlitz