నిఖిల్‌ కొత్త చిత్రం '18 పేజీలు' ప్రారంభం

  • IndiaGlitz, [Thursday,March 05 2020]

వరుస‌గా మంచి విజ‌యాలు సాధిస్తున్న నిఖిల్‌, బ‌న్నివాసు కాంబినేష‌న్ లో ఈరోజు ఫిల్మ్‌న‌గ‌ర్ టెంపుల్ లో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. ఈ చిత్రాన్ని అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జిఏ2 పిక్చ‌ర్స్ & సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ లు సంయుక్త నిర్మాణం లో నిర్మాత బ‌న్ని వాసు నిర్మిస్తున్నారు. రంగ‌స్థ‌లం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని అందించిన సుకుమార్ గారు ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. మంచి క‌మ‌ర్షియ‌ల్ పాయింట్ ని తీసుకుని మ్యూజిక‌ల్ యూత్ ఫిల్మ్ గా కుమారి 21ఎఫ్ తో ట్రెండ్ క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌కత్వంలో మ‌రో క్రేజి చిత్రం తో మ‌న‌ముందుకు వ‌స్తున్నాడు . ఈరోజు ప్రారంభ‌మైన 18 పేజీలు చిత్రానికి అల్లు అర‌వింద్ గారు పూజాకార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌గా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె బేబి అల్లు అర్హ హీరో నిఖిల్ మీద క్లాప్ నివ్వ‌గా..నిర్మాత బ‌న్నివాసు కుమార్తె బేబి హ‌న్విక‌ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.. క్రియేటివ్ ద‌ర్శ‌కుడు సుకుమార్ మెద‌టి షాట్ కి ద‌ర్శ‌క‌త్వం చేశారు. ఈ చిత్రానికి గొపి సుంద‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

అల్లు అర‌వింద్‌-నిఖిల్‌-బ‌న్నివాసు కాంబినేష‌న్‌:

అల్లు అర‌వింద్‌-నిఖిల్‌-బ‌న్నివాసు కాంబినేష‌న్‌ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో ఇంటిలిజెంట్ ప్రోడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాత‌గా గ‌తంలో వ‌చ్చిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌. గీతాగోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాల్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈరోజు అదే వూపుతో ఇప్ప‌డు అర్జున్ సుర‌వ‌రం లాంటి విజ‌యాలతో యూత్ లో క్రేజిస్టార్ గా పిలుచుకునే నిఖిల్ హీరోగా 18 పేజీలు అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మినిమ‌మ్ గ్యారంటి లేకుండా వీరిలో ఏ ఒక్క‌రూ ప్రాజెక్టు ఒకే చెయ్యర‌ని తెలిసిన వారంతా ఈ ప్రాజెక్ట్ పై అంచ‌నాలు భారీగా పెంచుకున్నారు..

సుకుమార్‌-ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ కాంబినేష‌న్‌:

ఇంటిలెక్చువ‌ల్ ద‌ర్శ‌కుల్లో సుకుమార్ ప్ర‌ధ‌మ‌స్థానం లో వుంటారు. ఆయన ఏ సబ్జెక్ట్ ట‌చ్ చేసినా ప్రేక్ష‌కుడి అభిరుచికి ద‌గ్గ‌ర‌గా వుంటుంది. అలాగే త‌న శిష్యుడు ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన కుమారి 21ఎఫ్ చిత్రం ఎలాంటి ఘ‌న‌విజ‌యం సాధించిందో అంద‌రికి తెలుసు. మ‌న‌సులో ఏమి దాచుకొకుండా నిజాయితిగా ఓక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే ఏలా వుంటుందో చాలా చ‌క్క‌గా మ్యూజిక‌ల్ మ్యాజిక్ తో చూపిస్తే ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్టారు. మ‌ళ్ళి మరొ కొత్త ట్రెండింగ్ చిత్రం తో ద‌ర్శ‌కుడు ప్ర‌తాప్ రావ‌ట‌మేకాకుండా మెద‌ట‌గా చిత్రం టైటిల్ తోనే ఆక‌ట్టుకున్నారు. కొత్త టైటిల్ తోనే కాదు కొత్త క‌థ తో రానున్నారు. మ‌ర‌లా మ‌రో ఘ‌న‌విజ‌యానికి ఈరోజు ఈ కాంబినేష‌న్ తొ శ్రీకారం చుట్టారు

More News

హైదరాబాద్‌లో థియేటర్లన్నీ మూసివేత!

టాలీవుడ్ పెద్దలు ఇవాళ సాయంత్రం 4 గంటలకు అత్యవసరంగా భేటీ కానున్నారు. ఈ భేటీలో భాగంగా పలు కీలక విషయాలపై చర్చించనున్నారు.

మే నెల‌లో అక్కినేని బ్ర‌ద‌ర్స్ సంద‌డి

ప్ర‌స్తుతం స్టార్ వార‌సులు ఎక్కువ‌య్యారు. ఈ నేప‌థ్యంలో ఒక్కొక్క‌సారి ఒకే నెల‌లో ఒకే కుటుంబానికి చెందిన హీరోలు పోటీ ప‌డాల్సి వ‌స్తుంది.

‘మా’ అధ్య‌క్షుడిగా బెన‌ర్జీ.. కార‌ణ‌మ‌దే!!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా) అధ్య‌క్షుడిగా వీకే న‌రేష్ స్థానంలో బెన‌ర్జీ నియ‌మితుడ‌య్యాడు. ప్ర‌స్తుత ప్రెసిడెంట్ న‌రేశ్ షూటింగ్స్ నిమిత్తం 41 రోజుల పాటు సెల‌వు పెట్టాడు.

రాహుల్ సిప్లిగంజ్‌పై బీరుసీసాల‌తో దాడి..

సింగ‌ర్‌, బిగ్‌బాస్ 3 విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్‌పై బుధ‌వారం రాత్రి దాడి జ‌రిగింది. హైద‌రాబాద్‌లోని ఓ ప‌బ్బులో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

రామ్ కోసం హెబ్బా ఐటెమ్ సాంగ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్‌పై స్రవంతి ర‌వికిషోర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.