ఏపీ ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ వేసిన నిమ్మగడ్డ

  • IndiaGlitz, [Wednesday,October 21 2020]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఏపీ ప్రభుత్వానికి మధ్య మళ్లీ అగ్గి రాజుకున్నట్టు కనిపిస్తోంది. తాజాగా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ నిర్వహణకు ఖర్చయ్యే నిధులను ప్రభుత్వం మంజూరు చేయకుండా నిలిపి వేసిందని రమేష్ కుమార్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఎన్నికల నిర్వహణకు సైతం ప్రభుత్వం సహకరించడం లేదని రమేష్ కుమార్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై కోర్టు వెంటనే జోక్యం చేసుకుని నిధులు విడుదల అయ్యేలా చూడాలని ఆయన కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్243(కే) ప్రకారం ఎన్నికల కమిషన్‌కు నిధులు ఆపేయడం చట్ట విరుద్ధమని రమేష్ కుమార్ పేర్కొన్నారు. వెంటనే నిధులు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర అత్యున్నత ధర్మాసనాన్ని ఎన్నికల కమిషనర్ కోరారు. ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీలను పేర్కొన్నారు.

More News

నీలా కాదు.. టైమ్ అంటే టైమే: చెర్రీ.. 5 నెలలు లేటు: తారక్

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా నుంచి హీరో రామ్

ప్రభాస్ సర్‌ప్రైజ్ వచ్చేసింది

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. రేపు ప్రభాస్ సర్‌ప్రైజ్ రాబోతోందని షూటింట్ స్పాట్ నుంచి నిన్న పూజా హెగ్డే ఓ వీడియోను విడుదల చేసిన

ట్రెండింగ్‌లో ప్రభాస్ సీడీపీ.. సర్‌ప్రైజ్ అంటున్న పూజా

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు మరో రెండు రోజుల్లో రాబోతోంది. దీని కోసం ప్రభాస్ అభిమానులు ఇప్పటికే సిద్ధమయ్యారు. క్యాజువల్‌గా అయితే కేక్ కటింగ్‌లు, రక్తదానాలు

సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రభాస్ కోటి విరాళం

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని ప్రతి ప్రాంతంలోని ఎంతో కొంత భాగం నీట మునిగింది. ఇక పాతబస్తీ అయితే చాలా వరకూ జల దిగ్బంధంలో ఉండిపోయింది.

పవన్ రూ.కోటి విరాళం

ప్రకృతి విపత్తులో సర్వం కోల్పోయిన వారికి మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందుకు వచ్చారు. తాజాగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌లోని ఏరియాలన్నీ జల దిగ్బంధంలో ఉండిపోయాయి.