ఒకే కుటుంబానికి చెందిన 9 మంది గల్లంతు..

  • IndiaGlitz, [Thursday,October 15 2020]

వర్షాలు బీభత్సానికి హైదరాబాద్ సహా చుట్టు పక్కల జిల్లాల్లో ఆస్తి నష్టంతో పాటు... ప్రాణ నష్టం కూడా సంభవిస్తోంది. రాజేంద్రనగర్ పల్లె చెరువు కట్ట తెగడంతో మైలార్ దేవుపల్లి అలీ నగర్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 9 మంది వరద నీటిలో గల్లంతయ్యారు. కాగా గల్లంతైన వారిలో.. దార్కస్ ఖురేషీ , ఫర్జానా తబస్సుమ్‌ల మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా వారి కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఏ క్షణమైనా పల్లె చెరువు కట్ట పూర్తిగా తెగే అవకాశం ఉంది. పూర్తిగా తెగితే అలీ నగర్, అల్ జుబేల్ కాలనీ పూర్తిగా నీట మునిగే ప్రమాదం ఉంది. సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెల్లవార్లూ అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాలైన అలీ నగర్, సుబాన్ కాలనీ వాసులను అధికారులు అప్రమత్తం చేశారు.

వరదల కారణంగా భయం గుప్పిట్లో గడిపిన మూసీ పరివాహక ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. వరదల కారణంగా చాదర్ ఘాట్, మూసానగర్, శంకర్ నగర్, రసూల్‌పురా, భూలక్ష్మి మాత వెనుక బస్తీ.. తదితర ప్రాంత వాసులు నిరాశ్రయులయ్యారు. ప్రాణ భయంతో సర్వస్వం వదిలేసి బతుకు జీవుడా అంటూ బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం వరద తగ్గినప్పటికీ బస్తీలన్నీ బురదమయమయ్యాయి. ఇప్పుడిప్పుడే మూసీ ప్రాంత వాసులు తిరిగి ఇళ్లకు చేరుతున్నారు.

More News

విడుదలకి సిద్దమైన 'వ‌ల‌స‌'

కళాకార్ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రావ్య ఫిలిమ్స్ పతాకం పై యెక్కలి రవీంద్ర బాబు నిర్మాణ సారథ్యంలో

'ట్రు` మూవీ టైటిల్ లోగో విడుద‌ల‌!

గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్ నూతన నిర్మాణ సంస్థలో గుణశేఖర్, సురేందర్ రెడ్డి మరియు వై వి ఎస్ చౌదరి దర్శకుల వద్ద అసోసియేట్ డైరెక్టర్

డిఫ‌రెంట్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ `మాయ‌` ఫ‌స్ట్‌లుక్‌కి సూప‌ర్ రెస్పాన్స్‌

ప్రవాస భారతీయురాలైన రాధికా జయంతి దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం `మాయ`. సంధ్య బయిరెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ పోషించ‌గా,

త‌లైవాపై మ‌ద్రాస్ హైకోర్టు ఆగ్ర‌హం

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌పై చెన్నై కోర్టు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. ఇంత‌కూ కోర్టుకి కోపం వ‌చ్చేలా రజినీకాంత్ ఏం చేశారు?

ఆమె ప్రసవం.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం..

ఒక మహిళ ప్రసవం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓ అనూహ్య పరిస్థితుల్లో కొన్ని వేల అడుగుల ఎత్తులో జరగడమే ఇందుకు కారణం.