'నిన్నే కోరుకుంటా' ఆడియో విడుదల

  • IndiaGlitz, [Saturday,January 30 2016]

సందీప్, విజ‌య్‌భాస్క‌ర్‌, ఆనంద్‌, పూజిత‌, సారిక పావ‌ని హీరో హీరోయిన్లుగా శుభ‌క‌రి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై గ‌ణ‌ముర‌ళి శ‌ర‌గ‌డం ద‌ర్శ‌క‌త్వంలో మ‌రిపి విద్యాసాగ‌ర్‌(విన‌య్‌) నిర్మిస్తున్న చిత్రం నిన్నే కోరుకుంటా. ప్ర‌ణ‌వ్ మ్యూజిక్ అందించిన ఈసినిమా పాట‌ల విడుద‌ల కార్య‌క్ర‌మం శుక్ర‌వారం విడుద‌లైంది. కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా హాజ‌రైన తూరుపు జ‌గ్గారెడ్డి బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...

తూరుపు జ‌గ్గారెడ్డి మాట్లాడుతూ ''నిన్నే కోరుకుంటా పాట‌లు బావున్నాయి. సినిమా పెద్ద విజ‌యాన్ని సాధించి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మంచి పేరు తేవాల‌ని కోరుకుంటున్నాను'' అన్నారు.

మ‌ల్కాపురం శివ‌కుమార్ మాట్లాడుతూ ''పాట‌లు బావున్నాయి. ఈ సినిమాలో న‌టించిన విజ‌య్‌భాస్క‌ర్ నాకు మంచి మిత్రుడు. ఈ సినిమా త‌నతోపాటు ఇందులో న‌టించిన వారంద‌రికీ మంచి పేరు తీసుకురావాలి. నిర్మాత మ‌రిన్ని సినిమాలు చేయాలి'' అన్నారు.

దేవిప్ర‌సాద్ మాట్లాడుతూ ''పాట‌లు, సినిమా పెద్ద హిట్ సాధించాలి. ప్ర‌ణ‌వ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. చిన్న సినిమాగా విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం పెద్ద విజ‌యాన్ని సాధించాలి'' అన్నారు.

విజ‌య్ భాస్క‌ర్ మాట్లాడుతూ ''గుడ్ టైటిల్‌. టైటిల్ విన్న‌వాళ్ళంద‌రూ బాగుంద‌నే అన్నారు. ముగ్గురు యువ‌కులు, ఓ యువ‌తికి మ‌ధ్య జ‌రిగే రొమాంటిక్ ల‌వ్ స్టోరీ. మంచి కామెడితో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది. త‌ప్ప‌కుండా సినిమాను పెద్ద స‌క్సెస్ చేస్తార‌ని న‌మ్ముతున్నాం'' అన్నారు.

నిర్మాత మ‌రిపి విద్యాసాగ‌ర్‌(విన‌య్‌) మాట్లాడుతూ ''సినిమాను ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా తెర‌కెక్కించాం. మంచి రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ప్ర‌ణ‌వ్ మ్యూజిక్‌, ఇత‌ర టెక్నిషియ‌న్స్‌, ఆర్టిస్టులు స‌పోర్ట్‌తో సినిమాను అనుకున్న స‌మయంలోనే పూర్తి చేశాం. ఆడియో, సినిమాను ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను'' అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో హీరోయిన్ పూజిత‌, తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, ల‌య‌న్ సాయివెంకట్‌, వైజాగ్ ప్ర‌సాద్‌, రాములు, నాగుగ‌వ‌ర‌, సంధ్యాజ‌న‌క్ త‌దిత‌రులు పాల్గొని చిత్ర‌యూనిట్ ను అభినందించారు.

సంధ్యాజ‌న‌క్‌, వైజాగ్ ప్ర‌సాద్‌, స‌రోజ‌, కొండ‌ల‌స ల‌క్ష్మ‌ణ‌రావు, ప్ర‌స‌న్న‌కుమార్‌, పూర్ణిమ ఇత‌ర తారాగ‌ణంగా న‌టించారు. ఈ చిత్రానికి సాహిత్యంః కుల‌శేఖ‌ర్‌, పోతుల ర‌వికిర‌ణ్‌, ఆర్ట్ః నాగు, ఎడిట‌ర్ః నంద‌మూరి హ‌రి, సంగీతంః ప్ర‌ణ‌వ్‌, నిర్మాతః మ‌రిపి విద్యాసాగ‌ర్‌(విన‌య్‌), ద‌ర్శ‌క‌త్వంః గ‌ణ‌ముర‌ళి శ‌ర‌గ‌డం.

More News

సుప్రీమ్ కి సూపర్ బిజినెస్..

మెగాస్టార్ మేనల్లుడు సాయిథరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సుప్రీమ్. ఈ చిత్రాన్ని పటాస్ ఫేం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

50 కోట్ల షేర్ క్రాస్ చేసినందుకు చాలా ఆనందంగా వుంది: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ ఎల్ పి పతాకంపై భారీ చిత్రాల నిర్మాత 'ఛత్రపతి' ప్రసాద్ నిర్మించిన 'నాన్నకు ప్రేమతో..' సంక్రాంతికి విడుదలై సూపర్హిట్ అయింది.

ఫిభ్రవరి 12న 'కృష్ణగాడి వీరప్రేమగాథ'

ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై యంగ్ హీరో నాని, మెహరీన్(నూతన పరిచయం) హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’.

బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కి చిరు అభినందన..

బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కి చిరు అభినందన అనగానే... ఎవరా.. బ్లాక్ బష్టర్ డైరెక్టర్ అనుకుంటున్నారా..? ఎవరో కాదు సోగ్గాడే చిన్ని నాయనా చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. సంక్రాంతి కానుకగా రిలీజైన సోగ్గాడే చిన్ని నాయనా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో నేటికీ హాస్ ఫుల్ కలెక్షన్స్ తో ప్రదర్శింపబడుతుండడం విశేషం.

ఆ.. ఇద్దరికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్..

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మోత్సవం. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు, తమిళ్ లో నిర్మిస్తుంది. ఈ చిత్ర్రం ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఏప్రిల్ 29న బ్రహ్మోత్సవం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.