ఫ్యాన్సీ రేటుకు 'నిన్ను కోరి' యు.ఎస్ హక్కులు..?

  • IndiaGlitz, [Wednesday,March 01 2017]

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం పేరు 'నిన్ను కోరి'. రీసెంట్‌గా 'నిన్ను కోరి' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ జరుగుతోంది. మార్చి 10 వరకు అమెరికా షెడ్యూల్‌ వుంటుంది. తర్వాత వైజాగ్‌లో జరిగే షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్‌ పూర్త‌య్యేలా ప్లాన్ చేస్తున్నారు.

నేచురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే ఈ సినిమా యు.ఎస్‌. హ‌క్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడు పోయాయి. రెడ్ హార్ట్స్ సంస్థ నిన్ను కోరి సినిమా యు.ఎస్‌. హ‌క్కుల‌ను 3.75 కోట్ల‌కు ద‌క్కించుకుంద‌ని స‌మాచారం. రీసెంట్‌గా నాని నేను లోకల్ సినిమా యు.ఎస్‌లో మిలియ‌న్ డాల‌ర్స్ చిత్రంగా నిలిచింది. ప్ర‌స్తుతం ఉన్న యంగ్ హీరోస్‌లో నానికి ఓవ‌ర్‌సీస్‌లో మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది.

More News

'కాటమరాయుడు' లీక్....

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై శరత్ మరార్ నిర్మిస్తోన్న చిత్రం కాటమరాయుడు.

జో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు...టైటిల్...

విలక్షణ కాన్సెప్ట్ ల తో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు బాల.

పవన్ కు తమ్ముడు బహుమానం...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాటమరాయుడు చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

ప్రభాస్ న్యూ ప్లాన్స్

బాహుబలి ది బిగినింగ్,ది కంక్లూజన్ తో దాదాపు రెండుమూడేళ్లు బిజీగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు మరోసారి కమర్షియల్ గాలిని పీల్చుకుంటున్నారు.

చరణ్ చిత్రంలో వైభవ్?

చిరంజీవి హిట్ చిత్రాల పేర్లు చెప్పడం మొదలుపెట్టిన వారు దర్శకుడిగా కోదండరామిరెడ్డి పేరును అంత తేలిగ్గా మర్చిపోలేరు.వారిద్దరి అనుబంధం అలాంటిది.