'నువ్వు తోపురా' తో నిన్నటితరం కథానాయిక నీరోషా రీఎంట్రీ

  • IndiaGlitz, [Saturday,June 24 2017]

హరనాథ్ బాబు.బి దర్శకత్వంలో "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" ఫేమ్ సుధాకర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "నువ్వు తోపురా". యునైటెడ్ ఫిలిమ్స్ పతాకంపై డి.శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధాకర్ కోమాకుల సరసన నిత్యా శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నిన్నటితరం కథానాయకి నిరోష ఓ ముఖ్యపాత్ర పోషిస్తోంది. "సావిత్రి" అనే పాత్రతో నిరోష రీఎంట్రీ ఇస్తుండడం పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి.శ్రీకాంత్ మాట్లాడుతూ.. "సీనియర్ హీరోయిన్ నిరోష గారు మా సినిమా ద్వారా మళ్ళీ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తుండడం మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా బరువైన పాత్రలో నిరోష కనిపించనున్నారు. ఆమె పాత్ర పేరు "సావిత్రి". సినిమాకి ఆమె పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అత్యుత్తమ సాంకేతిక నిపుణులతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మా దర్శకుడు హరినాధ్ బాబు.బి తెరకెక్కిస్తున్నారు" అన్నారు.

More News

'అదిరింది' అంటున్న విజయ్

తమిళ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు తన 61వ సినిమాను శరవేగంగా పూర్తి చేసేస్తున్నాడు. రాజా రాణి ఫేమ్ అట్లీ దర్శకత్వంలో విజయ్ ఇది వరకే థెరి(తెలుగులో పోలీస్) అనే సినిమా చేశాడు. సినిమా పెద్ద హిట్ అయ్యింది.

నటుడిగా ఎలాంటి పాత్రలనైనా చేయడానికి సిద్ధం - హవీష్

అమెరికాలో చదువు పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత చిన్నికృష్ణగారితో సినిమా చేయాల్సింది కానీ కుదరలేదు. సినిమాల్లో నటించాలనే ఆసక్తి బలంగా ఉండటంతో సత్యానంద్గారి దగ్గర ఆరు నెలలు పాటు శిక్షణ తీసుకున్నాను.

బన్ని సినిమాలో నాని హీరోయిన్..

జెంటిల్మన్ సినిమాలో గ్లామర్తో పాటు అభినయంతో ఆకట్టుకుంది హీరోయిన్ నివేదా థామస్. ఇప్పుడు జై లవకుశ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పక్కన నటిస్తుంది.

మోహన్ బాబు దర్శకత్వం చేస్తున్నాడా..?

600పైగా చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా నటించిన మోహన్బాబు త్వరలోనే మెగాఫోన్ పట్టబోతున్నాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం. ఈ సినిమాలో విష్ణు హీరోగా నటిస్తాడనే వార్తలు వినపడుతున్నాయి.

రెండవ షెడ్యూల్ 'సోడా గోలిసోడా'

ఎస్.బి ఆర్ట్ క్రియోషన్స్ బ్యానర్ పై భువనగిరి సత్య సింధూజ నిర్మాత గా మెట్టమెదటిసారిగా నిర్మిస్తున్న చిత్రం సోడా గోలి సోడా.. ఉబయగోదావరి జిల్లాల్లో అమలాపురం, పాలకొల్లు లాంటి అందమైన ప్రదేశాల్లో మెదటి షెడ్యూల్ పూర్తిచేసుకుని ప్రస్తుతం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రెండ షెడ్యూల్ జరుపుకుంటుంది.