'నిశ్శబ్దం' సెన్సార్ పూర్తి

  • IndiaGlitz, [Wednesday,May 27 2020]

అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం నిశ్శబ్దం. మాధవన్, సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే, మైఖేల్ హడ్సన్ తదితరులు ఇతర అ పాత్రలో నటించారు. ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా ఎఫెక్ట్ తో ఆగింది. లాక్ డౌన్ పొడిగింపు కారణంగా నిశ్శబ్దం చిత్రాన్ని డిజిటల్ మాధ్యమంలో విడుదల చేస్తారని వార్తలు వినిపించాయి. దీనిపై నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ స్పందించారు. నిశ్శబ్దం చిత్రాన్ని దాదాపు థియేటర్స్ లోనే విడుదల చేస్తామని, పరిస్థితులు అంతగా కలిసి రాకపోతే అప్పుడు ఓటీటీ గురించి ఆలోచిస్తామని చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఆగస్టులో థియేటర్స్ ఓపెన్ అవుతాయని వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేస్తారా లేక డిజిటల్ లో విడుదల చేస్తారా అనేదానిపై క్లారిటీ రానుంది. క్రాస్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది. తెలుగు తప్ప మిగిలిన భాషల్లో ఈ చిత్రం సైలెన్స్ అనే పేరుతో విడుదలవుతుంది. అనుష్క ఈ చిత్రంలో మూగ, చెవిటి అమ్మాయిగా కనపడుతుంది.

More News

వామ్మో.. నాగుపాముకే స్నానం చేయించాడు!

టైటిల్ చూడగానే.. ఇదేంటి.. పామును చూస్తేనే వణుకుపడుతుంది అలాంటిది స్నానం చేయించడమా..? అనే ఆశ్చర్యపోతున్నారా..?

‘పుష్ప’ లో యాంకర్ సుమ నటించడంపై క్లారిటీ..!

టాలీవుడ్ స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అలియాస్ బన్నీ.. క్రియేటివ్‌ హెడ్‌గా పేరుగాంచిన సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’.

లాక్ డౌన్ ఎఫెక్ట్ : యువ నటి ఆత్మహత్య

కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్‌తో సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకూ ఎలాంటి అవస్థలు పడుతున్నారో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.

థ్యాంక్యూ సీఎం జగన్ గారూ.. : నాగబాబు

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిరర్థక ఆస్తుల అమ్మకాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

హైకోర్టు షాక్ : వైసీపీ ఎంపీ, ఆమంచి సహా 49 నోటీసులు

న్యాయస్థానాలు, న్యాయవాదులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అలాంటిది అన్నీ తెలిసిన అది కూడా ప్రజా ప్రతినిధులు వివాదాస్పద వ్యాఖ్యలు