ఆసక్తికర అంశాలతో ‘నిశ్శబ్దం’ ట్రైలర్ విడుదల..

  • IndiaGlitz, [Monday,September 21 2020]

అనుష్క ఒక ఛాలెంజింగ్ పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ చిత్రంలో మాధవన్ మరో కీలక పాత్రను పోషించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను నేడు రానా దగ్గుబాటి అభిమానులతో పంచుకున్నారు.

అనుష్క ఈ చిత్రంలో ఓ మూగ పెయింటర్‌గా నటించారు. ఒక పెయింటింగ్ కోసం అనుష్క, మాధవన్ వాంటెడ్ హౌస్‌కి వెళతారు. అక్కడ అనుష్క, మాధవన్ ఎదుర్కొనే ఊహించని పరిణామాలు.. అనుష్క బెస్ట్ ఫ్రెండ్ సొనాలి(షాలిని పాండే) కనిపించకుండా పోవడం.. సోనాలి కనిపించకుండా పోవడానికి కారణాలు ఏంటి? తదితర ఆకట్టుకునే అంశాలతో ఈ సినిమా చాలా ఆసక్తికరంగా తెరకెక్కినట్టు తెలుస్తోంది.

ఈ సినిమా తెలుగుతో పాటు.. తమిళ, మలయాళ భాషల్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. పలు కీలక పాత్రల్లో సుబ్బరాజు, మాడిసన్, మైఖేల్ తదితరులు నటిస్తున్నారు. నిజానికి ఈ చిత్రం వేసవిలో విడుదల కావాల్సి ఉంది. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియక పోవడంతో ఈ చిత్రం అక్టోబర్ 2న ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది. ఓటీటీలో విడుదలవుతున్న రెండో పెద్ద చిత్రంగా ‘నిశ్శబ్దం’ నిలవనుంది.

More News

అనురాగ్‌కశ్యప్‌కి పెరుగుతున్న మద్దతు

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌కు ఇండస్ట్రీ సెలబ్రిటీల నుండి మద్దతు దొరుకుతుంది.

నిర్మాత నట్టికుమార్ కుమార్తె నట్టి కరుణ ‘DSJ’ ‘దెయ్యంతో సహజీవనం...’ మూవీతో తెరంగేట్రం

నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ కుమార్తె నట్టి కరుణ ప్రధాన పాత్రలో ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం...)

అనుష్క ఫస్ట్‌ ఛాయిస్‌ కాదా..?

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'నిశ్శబ్దం'. రీసెట్‌గా గాంధీ జయంతి రోజున నిశ్శబ్దం సినిమాను అక్టోబర్‌ 2న విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

వేంకటేశ్వరునిపై కొడాలి నాని వ్యాఖ్యలపై శ్రీనివాసానంద కన్నీళ్లు..

వేంకటేశ్వర స్వామిపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్నే రేపుతున్నాయి.

రైతులకు అండగా కార్తీ.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం..

రైతుల ఆదుకునేందుకు హీరో కార్తీ నడుం బిగించారు. ఇది ఒక్క ఏడాదితో పోయేలా కాకుండా నిరంతరం కొనసాగేలా ప్లాన్ చేస్తున్నారు.