అయోధ్య తీర్పు: సుప్రీంకు ఆ అధికారం ఎక్కడిది!?

  • IndiaGlitz, [Thursday,November 21 2019]

దశాబ్దాలుగా కొనసాగిన అయోధ్య కేసు వివాదానికి నవంబర్-09/2019 నాడు సుప్రీంకోర్టు ఫుల్‌స్టాప్ పెట్టేసింది. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు దశబ్దాల కేసును కేవలం గంట వ్యవధిలోనే చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. అలహాబాద్‌ హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చి.. వివాదాస్పద భూమి రాముడి ఆలయానికే చెందుతుందని.. రామజన్మ న్యాస్‌కే అప్పగించడం జరిగింది. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని తీర్పునిచ్చింది. నిజంగా ఈ తీర్పును హిందువులకు ఓ శుభవార్త.. ప్రతి హిందువు గర్వంగా చెప్పుకోవాల్సిన రోజని చెప్పుకోవచ్చు. ఈ తీర్పును విమర్శకులు సైతం మెచ్చుకున్నారు. అంతేకాదు.. ఈ తీర్పునిచ్చిన సీజేఐ రంజన్ గొగోయ్ చరిత్రలో నిలిచిపోతారు కూడా. అయితే ఈ తీర్పుపై తాజాగా గోవర్దన పీఠాధిపతి స్వామి నిశ్చలానంద సరస్వతి తప్పుపట్టారు.

మీకెక్కడిది అధికారం!?

‘రామ మందిరానికే స్థలం చెందుతుందని చెప్పడం సబబే. కానీ... ఇతర మతాల వారికి స్థలాన్ని కేటాయించాలని చెప్పే అధికారం సుప్రీంకోర్టుకు ఎక్కడిది..? రేపొద్దున ఇలాగే కాశీ, మథుర అంశాలపై కూడా తీర్పులిచ్చి... ఆ ప్రాంతాలను మినీ పాకిస్థాన్‌గా మార్చేస్తారా?. అయోధ్యలో వివాదాస్పద 2.7 ఎకరాల భూమిని అందరికీ సమానంగా పంచాలనే ప్రతిపాదన అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు హయాంలోనే వచ్చింది. ఆ ప్రతిపాదనకు అందరూ అంగీకరించినా.. నేను మాత్రం అంగీకరించలేదు. నా వల్లే ఆ ప్రతిపాదన మరుగున పడిపోయింది’ అని సుప్రీం తీర్పుపై నిశ్చలానంద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరి ఈ వ్యవహారంపై బీజేపీ పెద్దలు, స్వామీజీలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.

More News

వైసీపీ ఎంపీని మోదీ భుజం తట్టడం వెనుక ఇదీ అసలు కథ!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు వైసీపీ ఎంపీలతో సమావేశమై.. మొత్తం అందరు ఎంపీలు..

రూలర్  టీజర్‌ : యూనిఫాం తీశానో ఆగను.. వేటే!

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 105వ చిత్రం ‘రూలర్’.

జగన్ సభలో ఏకైక ఎమ్మెల్యే.. ఆలోచనలో పడ్డ జనసేనాని!

జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు.

ఓ వైపు సోదాలు.. మరోవైపు ‘కరెన్సీ’ నోట్ల వర్షం!

ఇదేంటి భారీ వర్షం.. అతి భారీ వర్షం ఇంకా చేపల వర్షం చూశాం కానీ ఇదేంటి ఎక్కడైనా తుఫాన్ వస్తే కొంపదీసి దానికి ఇలా ‘కరెన్సీ నోట్ల వర్షం’ అని పేరు పెట్టారా..?

ఆర్టీసీపై కేసీఆర్‌ కన్నెర్రజేస్తారా.. కరుణిస్తారా!?

తెలంగాణ ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునే విషయమై కేసీఆర్ సర్కార్ ఇవాళ తేల్చనుంది.