close
Choose your channels

నితిన్ అ ఆ షూటింగ్ పూర్తి..

Monday, April 25, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యువ హీరో నితిన్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం అ ఆ. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ స‌ర‌స‌న స‌మంత న‌టిస్తుంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రం రూపొందుతుంది. హైద‌రాబాద్ లో చివ‌రి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
ఈ సంద‌ర్భంగా నితిన్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...అ ఆ షూటింగ్ పూర్త‌య్యింది. ఇక పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ స్టార్ట్ చేస్తున్నాం. అద్భుత‌మైన టీమ్ ని మిస్ అవుతున్నాను అంటూ అ ఆ టీమ్ తో దిగిన ఫోటోను పోస్ట్ చేసాడు. మిక్కి జే మేయ‌ర్ మ్యూజిక్ అందించిన అ ఆ ఆడియోను ఈ నెల 26న రిలీజ్ చేయ‌నున్నారు. అ ఆ చిత్రాన్ని మే నెల‌లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.