close
Choose your channels

నితిన్ కి తలనొప్పి తెస్తున్న కళ్యాణ్..

Sunday, September 6, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇష్క్`, గుండెజారి గల్లంతయ్యిందే` వంటి హిట్స్ తో ట్రాక్ లోకి వచ్చిన నితిన్ చిన్నదాన నీకోసం` చిత్రంతో ఆశించిన మేర విజయాన్ని అందుకోలేకపోయాడు. అయితే రెండున్నరేళ్ళ క్రితం గౌతమ్ మీనన్ సమర్పణలో గురు ఫిలిమ్స్ ప్రొడక్షన్, మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్ పై యంగ్ హీరో నితిన్, యామీ గౌతమ్ జంటగా రూపొందుతోన్న సినిమా కొరియర్ బాయ్ కల్యాణ్`. ప్రేమ్ సాయి దర్శకుడు.

ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయ్యింది. ఎట్టకేలకు ఈ సినిమాని నిర్మాతలు సెప్టెంబర్ 11న విడుదల చేయాలని నిర్మాతలు అనుకున్నారు. అయితే చూడబోతుంటే సినిమా అనుకున్నతేదీలో విడుదల కావడం లేదు. అందుకు కారణం సెన్సార్ కాకపోవడమేనట. చిన్న సినిమాలు దాదాపు ఎడెనిమిది సెన్సార్ వరుసలో ఉండటంతో కొరియర్ బాయ్ కళ్యాణ్ సెన్సార్ అనుకున్న సమయంలో సెన్సార్ కాదనే వార్తలు వినపడుతున్నాయి. అయితే నిర్మాతలు మాత్రం తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారట. ఏదేమైనా నితిన్ తనకిష్టమైన పవన్ కళ్యాణ్ పేరుతో స్టార్ట్ చేసిన సినిమా నితిన్ పెద్ద తలనొప్పినే తెచ్చిపెడుతుందన్నమాట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.