'లై' చిత్రంలోని అర్జున్ ఫస్ట్ లుక్ విడుదల

  • IndiaGlitz, [Thursday,July 06 2017]

యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం 'లై' (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి). ఈ చిత్రంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలోని అర్జున్‌ ఫస్ట్‌లుక్‌ను గురువారం విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ పూర్తి కావచ్చింది. ఆల్రెడీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ స్టార్ట్‌ అయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్ట్‌ 11న 'లై' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
యూత్‌స్టార్‌ నితిన్‌, మేఘా ఆకాష్‌, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, శ్రీరామ్‌, రవికిషన్‌, పృథ్వీ, బ్రహ్మాజీ, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్‌, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, డాన్స్‌: రాజు సుందరం, ఫైట్స్‌: కిచ్చా, పాటలు: కృష్ణకాంత్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.

More News

ఆగస్టు 4న సుకుమార్ దర్శకుడు

వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి నిర్మించిన తొలిచిత్రం కుమారి 21 ఎఫ్ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సుకుమార్ నిర్మాతగా తన సొంత సంస్థలో నిర్మిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం దర్శకుడు.

ఈగ నుండి చేప...

వరుస విజయాలను సాధిస్తున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు నటుడే కాదు, నిర్మాత కూడా. డి ఫర్ దోపిడి సినిమాకు నాని నిర్మాతగా మారారు. ఆ సినిమా తర్వాత నాని మరే సినిమాను నిర్మించలేదు.

జూలై 28న విడుదలవుతున్న 'గౌతమ్ నంద'

మాస్ హీరో గోపీచంద్,హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న

క్రికెటర్ గా అందరిని ఆకట్టుకున్న శ్రీశాంత్ టీమ్-5 చిత్రం ద్వారా నటనలోనూ అందరిని ఆకట్టుకుంటాడు

భారత జాతీయ క్రికెటర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీశాంత్,ఇప్పుడు టీమ్-5 అనే చిత్రం ద్వారా వెండితెర కు పరిచయం కానున్నాడు.

విజయ్..పొలిటికల్ లీడర్

తమిళ స్టార్ హీరో విజయ్..ఇప్పుడు తెరపై పొలిటికల్ లీడర్ గా కనపడబోతున్నాడని సమాచారం.