నితిన్‌, హను రాఘవపూడి కాంబినేషన్‌లో 14 రీల్స్‌ కొత్త చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Thursday,September 08 2016]

యూత్‌స్టార్‌ నితిన్‌ హీరో వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై 'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీరప్రేమగాథ' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర ప్రొడక్షన్‌ నెం.9గా నిర్మిస్తున్న కొత్త చిత్రం సెప్టెంబర్‌ 8న సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. 'అఆ' వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత యూత్‌స్టార్‌ నితిన్‌ చేస్తున్న మరో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కి ప్రముఖ నిర్మాత ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి క్లాప్‌నివ్వగా, ప్రముఖ నిర్మాత, హీరో నితిన్‌ తండ్రి ఎన్‌.సుధాకర్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. హీరో నితిన్‌, చిత్ర నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర, ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్‌ పూజా కార్యక్రమాలు నిర్వహించి స్క్రిప్ట్‌ని దర్శకుడు హను రాఘవపూడికి అందించారు. నవంబర్‌ ద్వితీయార్థంలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌ ప్రారంభంలో రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ - ''ఇదొక డిఫరెంట్‌ లవ్‌స్టోరీ. నితిన్‌తో ఫస్ట్‌టైమ్‌ వర్క్‌ చేయడం చాలా సంతోషంగా వుంది. అందర్నీ ఆకట్టుకునే చక్కని ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌లో 'కృష్ణగాడి వీరప్రేమగాథ' తర్వాత చేస్తున్న ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది'' అన్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్‌, సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.

More News

నవరస నట తిలకం మోహన్ బాబు..!

తెలుగు తెరపై ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి...ప్రేక్షకులను ఆకట్టుకుని తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకున్నారు విలక్షణ నటుడు మోహన్ బాబు.

బాహుబ‌లి 2 కోసం నాగార్జున‌..!

బాహుబలి 2 ఓ వైపు షూటింగ్ జ‌రుగుతుండ‌గానే...మ‌రో వైపు చ‌క‌చ‌కా బిజినెస్ జ‌రిగిపోతుంది. ఇంత‌కీ బాహుబ‌లి 2 కోసం నాగార్జున..? ఏమిటి అనుకుంటున్నారా..?

అథ్లెటిక్ పాత్ర‌లో ర‌కుల్‌...

ప్ర‌స్తుతం  సూప‌ర్‌స్టార్ మ‌హేష్, ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ ల చిత్రంతో పాటు మెగా ప‌వ‌ర్‌స్టార్  రామ్ చ‌ర‌ణ్ ధృవ చిత్రంతో పాటు సాయిద‌ర‌మ్ తేజ్, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రంలో న‌టిస్తుంది.

ఖైదీ నెం 150 రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన వినాయ‌క్..!

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న‌150 చిత్రం ఖైదీ నెం 150. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

చిరు- నాగ్ - స‌చిన్ లుంగీ డ్యాన్స్..!

కేర‌ళ బ్లాష్ట‌ర్స్ జ‌ట్టుకు స‌చిన్ టెండూల్క‌ర్, చిరంజీవి, నాగార్జున‌, నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్, అల్లు అర‌వింద్ స‌హ య‌జ‌మానులుగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఈ కేర‌ళ బ్లాష్ట‌ర్స్ జ‌ట్టు మూడో సీజ‌న్ కు రెడీ అవుతున్నారు.