సన్నాహాల్లో నితిన్, కె.కె.రాధామోహన్ చిత్రం

  • IndiaGlitz, [Wednesday,February 08 2017]

ఏమైంది ఈవేళ, బెంగాల్‌ టైగర్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్‌ మరో భారీ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారు. యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై శ్రీమతి లక్ష్మీరాధామోహన్‌ సమర్పణలో ఈ చిత్రం రూపొందనుంది.
ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ - ''నితిన్‌తో ఓ సూపర్‌హిట్‌ చిత్రం తియ్యాలన్న ఉద్దేశంతో సబ్జెక్ట్‌ రెడీ చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నితిన్‌... హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా, కృష్ణచైతన్య డైరెక్షన్‌లో మరో సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల అనంతరం ఆగస్ట్‌ తర్వాత మా చిత్రం ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాము'' అన్నారు.

More News

బెల్లంకొండ శ్రీను టైటిల్...

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేషన్లోద్వారక క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

శివరాత్రికి జగన్నాథుడు..

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, దిల్రాజు, హరీష్ శంకర్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం `డిజె..దువ్వాడ జగన్నాథమ్`. దిల్రాజు బ్యానర్లో గతంలో బన్ని ఆర్య, పరుగు సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు పెద్ద సక్సెస్ను సాధించాయి.

అను ఇమ్మాన్యుయల్ స్థానంలో రీతూవర్మ...

మజ్ను, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్ సహా పలు చిత్రాల్లో నటిస్తున్న హీరోయిన్ అను ఇమ్మాన్యుయల్ విక్రమ్ హీరోగా, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ధృవ నక్షత్రం సినిమాలో కథానాయికగా ఎన్నికైంది.

రవితేజ సినిమా నుండి తప్పకున్న హీరోయిన్...

మాస్ మహారాజా రవితేజ ఈ ఏడు రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు నిర్మిస్తున్న చిత్రం `టచ్ చేసి చూడు`.

'వీడెవడు' అంటున్న అఖిల్....

అక్కినేని అఖిల్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఈరోజు ఓ పోస్టర్ ను అప్ లోడ్ చేయడం ద్వారా హల్ చల్ చేశాడు.