బరువు తగ్గిన నితిన్
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు నితిన్ మూడు సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో ముందుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో `భీష్మ` షూటింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో ఏడాది గ్యాప్‌లో నితిన్ నితిన్ తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టారు. అందులో భాగంగా నితిన్ ఏకంగా 12 కిలోల బరువు తగ్గాడట. భుజానికి గాయమైన తర్వాత నితిన్ రెస్ట్ తీసుకున్నారు. అది తగ్గే లోపు తన చేయి కాలింది. దీంతో నితిన్ పూర్తి రెస్ట్‌లో ఉండిపోయారు. ఆ సమయంలో పెరిగిన బరువును తగ్గించుకోవడానికి వర్కవుట్స్ చేసుకుంటూ ఆయన 12 కిలోలు బరువు తగ్గాడట. `భీష్మ` తర్వాత చంద్రశేఖర్ ఏలేటి, వెంకీ అట్లూరి, కృష్ణ చైతన్య దర్శకత్వాల్లో నితిన్ సినిమాలు చేయాల్సి ఉంది. `భీష్మ` చిత్రంలో నితిన్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.