ప‌వ‌న్‌కు క‌లిసొచ్చిన తేదికి నితిన్‌

  • IndiaGlitz, [Friday,March 30 2018]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో మ‌ర‌చిపోలేని చిత్రం 'తొలిప్రేమ‌'. ప‌వ‌న్ కెరీర్‌లో ట‌ర్నింగ్ పాయింట్‌లా నిలిచిన ఈ సినిమా 20 ఏళ్ళ క్రితం అంటే... 1998లో జూలై 24న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. క‌ట్ చేస్తే.. 20 ఏళ్ళ త‌రువాత అదే తేదికి ప‌వ‌న్ వీరాభిమాని అయిన యువ క‌థానాయ‌కుడు నితిన్ త‌న కొత్త సినిమాతో ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

కాస్త వివ‌రాల్లోకి వెళితే.. దిల్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో నితిన్ ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 'శ్రీ‌నివాస క‌ళ్యాణం' పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకి శ‌త‌మానంభ‌వ‌తి ఫేమ్ స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రాశీ ఖ‌న్నా, నందితా శ్వేత క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌కాశ్ రాజ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభించుకున్న ఈ సినిమాను జూలై 24న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు చిత్ర వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. మ‌రి.. ప‌వ‌న్‌కు క‌లిసొచ్చిన తేది నితిన్‌కు క‌లిసొస్తుందా?  వెయిట్ అండ్ సీ.

More News

సేమ్ ఫీట్ రిపీట్ చేయ‌నున్న బాల‌య్య‌

శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌..

నితిన్ హీరోయిన్‌తో అఖిల్‌

అక్కినేని మూడో త‌రం వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేని `అఖిల్‌`

ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్ కు వెళ్లనున్న ప్రభుదేవా 'మెర్క్యూరీ'

ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన మూకీ సినిమా 'మెర్క్యూరీ'  ప్రతిష్టాత్మక "ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్" లో ప్రదర్శింపబడనుంది.

మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న 'భద్రకాళి'

బేబి తనిష్క, బేబి జ్యోషిక సమర్పణలో ఆర్‌. పిక్చర్స్‌ పతాకంపై సీనియర్‌ నటి సీత అమ్మవారి పాత్రలో అత్యంత భారీ గ్రాఫిక్స్‌తో చిక్కవరపు రాంబాబు నిర్మిస్తున్న చిత్రం 'భద్రకాళి'.

సెన్సార్ పూర్తిచేసుకొన్న 'సత్య గ్యాంగ్'

క్వాలిటీ కొరకు 16 నెలలు శ్రమించి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, మంచి పాటలు ,ఫైట్స్ ,డాన్స్ ముఖ్యంగా సెంటిమెంట్ కు ప్రాదాన్యత నిస్తూ తెరకెక్కించిన చిత్రం "సత్యగ్యాంగ్".